ఈ పుటను అచ్చుదిద్దలేదు

78 గణిత చంది క. ఎడి అను దిక్కునకును అంతయే తిప్పవలయును. వంకర లేసి రెండుపుల్లలను తీసికొని వానిని నేలమీద ఒక కోణ మేర్పడు నట్లు ఉంచుము. ఆ పుడకలను జరుగనీయకుండ పట్టుకొని ఒక దానిలో కొనతట్టు కొంత కత్తిరించుము. కోణము మారి నదా ? రెండవపుడక నుండియు కొనతట్టు కొంత తీసి వేయుము. కోణము మారినదా? లేదు. భుజములను పొడిగించినను పొట్టి చేసినను కోణము మారదు. ప్రక్కపటమున పడమరనుండి తూర్పునకు గీయబడిన "రేఖ ఒకటియు, దక్షిణమునుండి ఉత్తరమునకు గీయబడిన గేఖ ఒక టియు ఉన్నవి. తూర్పు దిక్కు నుండి ఉత్తరము నకు ఎంత తిరుగవలెనో ఉత్తరము నుండి పడమరకు అంతయే తిరుగ నలెను. పె పటమున రెండు కోణ ములు ఏర్పడినవి. 'రెండును సమా నము. వీనిలో ఒక్కొక్కటియు సమకోణము అని చెప్పబడును. పు