ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

గణిత చంద్రిక


సాధారణ సంఖ్యలను భాగించిన విధముననే భాగించ వచ్చును.

అభ్యాసము 12.

ప్రశ్నలు:-

(1) 4.5 అం. పొడవుగల దారమును ఐదు సమభాగములు చేసిన భాగము ఎంత ?

(2) 16.5 గజముల తానును 3 సమభాగములు చేసిన 'భాగము పొడవు ఎంత ?

(3) 19 గజముల తానును 5 గురికి సమముగ పంచిన ఒక్కొక్కరికీ యెంతవచ్చును ?

(4) 7.5 రూపాయలను ముగ్గురికి పంచుము ?

(5) ఒకరోడ్డు పొడవు 23 గొలుసులు. ఈరోడ్డును 10 దినములలో మరమ్మతు చేయవలసినయెడల దినమునకు యెంత చేయవలయును?