ఈ పుట అచ్చుదిద్దబడ్డది
30
గణిత చంద్రిక.
జిల్లా పటము 1 అంగుళము=10 మైళ్ళ ప్రకారము గీయబడినది. ఇందు రెండు గ్రామములదూరము 3 అంగుళము లయిన అసలుదూరము 30 మైళ్ళని గ్రహించవలయును.
ఒక పటమును చూపి కొన్ని దూరములు కొలిపించి అసలుదూరమును కనుగొనునట్లు చేయవ లెను.
ఒక పటమున అంగుళము పదిమైళ్ళను తెలుపును. రెండుగ్రామముల మధ్య దూరము 2.5 అంగుళములు అయిన గ్రామములకు అసలుదూరము ఎంత ?
- అంగుళము= 10 మైళ్ళు
- 2 అం.=20 మైళ్ళు
- .5 అం.= 5 మైళ్ళు కనుక
- 2.5 అం =25 మైళ్ళు,
శరీర ఉష్ణమును కొలుచుటకు ఉష్ణమాని అనుసాధనమును వైద్యులు ఉపయోగించుటను మీరు చూచియుందురు. దీని పటమును చూడుము. పాదరసము ఎంతవరకు ఎక్కునో అచ్చట గుర్తించిన సంఖ్య ఉష్ణ పరిమాణమును తెలుపును. ఈ సాధనమున రెండు డిగ్రీలకు మధ్యస్థలము 10 భాగములు చేయబడినది. ఒక్కొక్క భాగము . 1 డిగ్రీ - ధర్మామీటరు ఒక దానిని చూడుము.