ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ తరగతి

23


5. పుస్తకము రెండు కానులు. క పుస్తకముల వెల ఎంత? 2 క కానులు.

6. ఒక తరగతిలో పిల్లల సంఖ్య క. ఒక్కొక్కడు రెండు అణాలు యిచ్చిన ఎంత వసూ లగును ? 2 క అణాలు.

7. దినమునకు 3 అణాల చొ॥క దినముల కెంత కూలి? 3 క అణాలు.

8. ఒకడు దినమునకు క అణాలు సంపాదించి త అణాలు ఖర్చు పెట్టును. దినమున కెంత మిగులును ? క - త అణాలు.

9. అమ్మ ఒక రూపాయ యిచ్చినది. నాయన క అణాలు ఇచ్చెను. మొత్తము ఎన్ని అణాలు? 16 +క అణాలు.

10. క అణాలు, త పైసలు కలిసి ఎన్ని పైసలు ? 12క + త పైసలు.

11. త కానులు, 2 పైసలు కలిసి ఎన్ని పైసలు ? 3 త+2 పైసలు.

12. పైసకు బలపము. త బలపములు కొంటిని. ఎంత యివ్వవలెను ? త పైసలు.