ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

గణిత చంద్రి క.



ములు తగిలినందున వైద్యశాలకు పంపబడిరి. 7389 మంది శత్రువులచే చిక్కిరి. మిగిలినవా రెందరు ?

11. ఒకడు వ్యవసాయమునకు కూలి విత్తనము మొద లైన పనికి రూ 2015 లు ఖర్చు పెట్టెను. పొలము నుంచి రూ 1556 ల వడ్లు, రూ 789 ప్రత్తి, రూ 712 మగపకాయలు, రూ 1620 లు పొగాకు వచ్చినది. ఎంత లాభము ?

. 12. ఒక పట్టణము జన సంఖ్య ఆరులక్షల పండెండు వేలు అందు హిందువులు 3,43,182 మంది. మహమ్మదీ యులు 149686 మంది. క్రైస్తవులు 106288. మిగిలిన వారెందరు?

13. ఒక నికి వేరుశనగబేరములో జనవరిలో రూ 2016 లాభము, ఫిబ్రవరిలో రూ 1089 నష్టము, మార్చి నెలలో రూ 1863 లాభము వచ్చెను. మూడు నెలలలో కలిసి వ్యాపామున లాభము ఎంత ?

14. గుంటూరులో ఉన్నత పాఠశాలలు మూడు ఉన్నవి. ఒకదానిలో 1829 మంది చదువుచున్నారు. రెండవ పాఠశాలలో 868 మంది యున్నారు. మూడు పాఠశాలలలో కలిసి 3000 మంది యున్న యెడల మూడవ పాఠశాలలోని వారెందరు?