ఈ పుటను అచ్చుదిద్దలేదు

1104 చంది . 9వ అధ్యాయము. వడ్డీ - సరళవడ్డీ. మనము ఒక ఇంటిలో అ—్సకు ఉన్నాము. అనగా ఆ యిల్లును ఉపయోగించుకొనినందులకు ఆ ఇంటియజమానునికి నెలకు ఇంత అని అనె యిచ్చుచున్నాము. ఒక బండిలో ప్రయాణము చేసిన బండిని ఉపయోగించుకొనినందుకు బండికి బాడుగ ఇచ్చుచున్నాము. అదేవిధమున మనము ఎవరివద్ద నైన పైకము అప్పు తెచ్చుకొనిన, వారి పైకమును తిరుగ ఇచ్చునపుడు ఆపై కమును ఉపయోగించుకున్నందుకు కొంత పైకమును హెచ్చుగ ఇచ్చుచున్నాము. ఈ పైకమును వడ్డి యందుము. ఎక్కువ కాలము ఉపయోగించుకొనిన ఎక్కువ వడ్డీ ఇవ్వవలెను. ఎక్కువపైకము ఉపయోగించుకొనిన ఎక్కువ వడ్డీ యివ్వవలెను. తెచ్చుకొన్న పైకమును అసలు అందుము. ఉపయోగిం చుకొనినందులకు ఇచ్చు హెచ్చు పైకము “వడ్డీ ' యందుము. మాదిరి:- రూపోయకు దినమునకు వడ్డీ1 పైస. 4 రూపాయలు అప్పు తీసికొనిన 12 దినములకు వడ్డి ఎంత ?