పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/35

ఈ పుట ఆమోదించబడ్డది

పెరిగివున్నాయి. స్తంభాలూ, మండపమూ మరింతగా కూలిపోకుండా వుండేందుకు రక్షణ చర్యలు తీసుకుంటున్న ఛాయలు కనిపించడంలేదు. కనీసం చుట్టూ కంచె లేదా సరిహద్దుల ఏర్పాట్లేమీ లేవు. ఈ మధ్యకాలంలోనే ఈ గుడిలోని రంగమండపాన్ని యంత్రాలను ఉపయోగించి పగలగొట్టారు. అడుగుకు పైగా మందం వున్న బండను కత్తిరించి లోపల తవ్వకం చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇదే విధంగా నిర్లక్ష్యం కొనసాగితే ఈ ఆలయం త్వరలోనే పూర్తిగా శిథిలం అయ్యే అవకాశాలున్నాయి. కేవలం ప్రధాన ఆలయం వరకే స్థలాన్ని సేకరించి దానివరకు మాత్రమే ఒక సరిహద్దుగోడను నిర్మించారు. అందువల్ల ఇటువైపు ఇంత ప్రాముఖ్యత వున్న ఉప ఆలయాలు వున్నట్లే సందర్శకులకు తెలియడం లేదు. శిధిలాలయ ఆవరణమంతా పిచ్చిమొక్కలతో నిండి వుండటం వల్ల ఆలయరూపమే కనిపించడంలేదు. పైగా ఇటువైపు రావాలంటే భయపడేలావుంది.


వేణుగోపాల స్వామి ఆలయం

ప్రదాన ఆలయం మరియు ముక్కంటేశ్వరాలయాలకు మరింత దక్షిణాన చిన్నదిగా కుదురుగా వున్న ఈ ఆలయం అత్యంత శిధిల స్థితిలో వుంది. దీనిలో ప్రధాన గర్భగుడికి ముందు ఒక్కో వరుసలో 4 స్తంభాల లెక్కన నాలుగు వరుసలుగా పదహారు స్తంభాల ఆలయమండపం వుంది. ఇవిగాక తూర్పున మరో రెండు స్తంభాలు పోర్టికోలాగా అమర్చివుంటాయి. వాటితో కలిపి 16+2 మొత్తం పద్దెనిమిది స్తంభాల మండపంతో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ పదహారు స్తంభాలలో కూడా ప్రధాన ఆలయానికి ముందున్న నాలుగు స్తంభాలు ముక్కంటేశ్వరాలయంలో మాదిరిగానే ప్రత్యేక శిల్పరీతిని కలిగివున్నాయి.

చాలా కాలం క్రిందటి వరకూ మురళిని వాయిస్తున్న వేణుగోపాలుడి విగ్రహం ఇందులో వుండేదట. ఈ ఆలయం చుట్టుపక్కలున్న పొలాలకు చెందిన గ్రామస్తులు ఆ విగ్రహాన్ని చూసినట్లు వారి అనుభవాన్ని పేర్కొన్నారు. వేణుగోపాలుడు వైష్ణవ సంబంధమైన దేవుడు. శైవాలయ ప్రాంగణంలో