పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/26

ఈ పుట ఆమోదించబడ్డది

వున్నాయి. క్రింది భాగంలో వెడల్పయిన పెద్ద రాతి గడపను వుంచారు. ధ్వారభందానికి పైన వున్న అడ్డురాతిదూలం మధ్య భాగంలో గజలక్ష్మీదేవిని లలాటబింబంగా చిత్రించారు.

లలాట బింబం

నుదుటన బొట్టు పెట్టుకున్న విధంగా ద్వారబంధం పైన మధ్య భాగంలో చెక్కే శిల్పాలను

లలాట బింబం అంటారు. వీటిలో ప్రధానంగా గజలక్ష్మి విగ్రహం లేదా ఒకే పద్దతిలో మలచిన మహాగణపతి విగ్రహాన్నో చెక్కేవారు. ఈ ఆలయంలో లలాట బింబంగా గజలక్ష్మి విగ్రహం కనిపిస్తుంది.


గర్భాలయం

ఆలయంలోని ప్రధాన భాగమైన ఈ గర్భాలయానికి రెండు వరుసల్లో గోడలున్నాయి. బయటిగోడను బాహ్యభిత్తి అని, లోపలి గోడను అంతర భిత్తి అని అంటారు. వీటి మధ్య ఖాళీప్రదేశం కూడా వదిలారు. ఈ ఖాళీ ఉష్ణనియంత్రకంగా పనిచేయడంతో బయటి ఉష్ణోగ్రతల ప్రభావం లోపటిగదిలో ఎక్కువగా పడదు. ఈ రెండు గోడల మధ్య ఖాళీ ప్రదేశాలనుంచి రహస్య ప్రవేశమార్గాలున్నాయి. సబ్ వేలో ప్రవేశించిన తర్వాత వేర్వేరు దిశలకు మళ్ళీ అవి దారితీసినట్లు గోడల మధ్యనుంచి లోపటికి వెళ్ళిన దారి మళ్ళీ వేర్వేరు దిశలుగా చీలుతుంది వీటిద్వారా వేర్వేరు చోట్లకు వెళ్ళేలా నిర్మించుకోవడంతో అత్యవసర సమయాలలో దేవాలయం ఆనుపానులు తెలిసిన వారికివి రక్షణను కూడా కల్పించేవి కావచ్చు. అంతేకాకుండా భూగర్భంలో వున్న శివలింగం సాత్త్విక భాగాన్ని కేవలం అంత:పురం వాసం మాత్రమే సందర్శించుకునే ఏర్పటు వుండి వుంటుందని. బయటి ప్రదక్షిణా పధంలాగా లోపట కూడా మరో ప్రదక్షిణా పధం వుండొచ్చనేది ఒక ఊహ. లోపలి గోడ తర్వాత 15 అడుగుల పొడవు ఐదడుగుల వెడల్పు గల రాతి దిమ్మెలు పేర్చి గర్భాలయం, ముఖమంటపం నిర్మించారు. గర్భాలయంలోని శివలింగం 12 అడుగుల ఎత్తు, 6.3 కైవారంతో ఏకశిలా రూపంగా నిర్మించారు. దీనికింద మూడు అడుగుల విస్తీర్ణంతో పానవట్టం నిర్మించారు.

ప్రస్తరము లేదా పై కప్పు

గర్భగృహాన్ని లేదా అంతరాళాన్నిమూసిమూస్తూ పై కప్పువుంది. ఇది కూడా రాతి పలకలను జాగ్రత్తగా ఒకదానిపై ఒకటి ఆధారపడేలా పేర్చకుంటూ నిర్మించినదే. రీయిన్