పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/18

ఈ పుట ఆమోదించబడ్డది

కాకతీయుల సంక్షిప్త చరిత్ర

తెలుగు ప్రాంతం అంతటినీ ఒక్కటి చేసి శాతవాహనులు పరిపాలించిన వెయ్యేళ్ల తరువాత తిరిగి తెలుగువారందరినీ ఒకే ఏలుబడిలోకి తీసుకువచ్చిన వారు కాకతీయులు. దాదాపు రెండు శతాబ్దాల పాటు తెలుగుదేశాన్ని పరిపాలించి రాజకీయంగానూ, సాంఘికంగానూ తెలుగుజాతికి విశ్వవ్యాప్తమైన కీర్తి ప్రతిష్ఠలు కల్పించిన వారు కాకతీయులు. దక్షిణాన కంచి నుంచి తూర్పున దక్షిణ కళింగ వరకు, కోస్తా, తెలంగాణా ప్రాంతాలతో పాటు, ఆథోని, రాయచూరు, బీదరు కోటల దాకా కాకతీయ సామ్రాజ్యం విస్తరిల్లింది. కాకతీయ రాజుల పరిపాలనా కాలాన్నిపరిశీలించి చూస్తే కాకతీయ సామ్రాజ్యపు మొట్టమొదటి బేతరాజు క్రీ.శ. 992 నుండి 1052 వరకు పాలించాడు. మొదటి బేతరాజు ఖమ్మం జిల్లా మధిర తాలూకా ప్రాంతాన్ని, తర్వాత వరంగల్‌ జిల్లా మానుకోట ప్రాంతాన్ని పాలించాడు. ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలంలో ఈ బేతరాజు పేరుతో బేతుపల్లి గ్రామం వుంది. అక్కడ కాకతీయుల నాటి శివాలయం ఉన్నది. అలాగే బేతుపల్లికి దగ్గరలో