ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

95

తలంపవచ్చును. కాని యట్లుతలంపఁగూడదు. ఎంతచెట్టు కంత గాలి యన్నమాట జ్ఞాపక ముంచుకొనుఁడు. అతఁడు నలమహారాజంతవాడై ధర్మరాజంతవాడై ధనము గడ్డిపఱకగఁ జూడ నారంభించెను. జూదమనందు మంచిపందెములు పెట్టుటకు నలమహారాజువలె రాజ్యముకాని ధర్మరాజువలె భార్యగాని గంగాధరుఁనకు లేకపోయినను, యధాశక్తిగ నతఁడు కష్టపడి సంపాదించిన విత్తమెప్పటి కప్పుడు పాచిద్రవ్యము లేకుండ నొడ్డుచుఁ దరుచుగ నోడిపోవును. అప్పుడప్పుడు డప్పులపాలగుచు సొమ్ముదాచవలసిన బాధ లేకుండఁ గాలము గడుపుచుండెను. ఎప్పుడైనఁ నతడు గెలిచినా యా సొమ్మదివఱకు చేసిన ఋణము దీర్చుట క్రింద పోవును. అప్పుతీరగా నించుక మిగిలెనా యది సింహాచలయాత్ర క్రిందసరిపోవును. చిత్తజల్లు సింహాచలమని యాయూర నొక వేశ్యాంగన కలదు. దాని వయస్సు గంగాధరుని వయస్సుకంటె రెట్టింపు గలదు. కాకినాడ పురవాసులలో ననేకు లదివఱకు సింహాచలసేవ చేసి చేసి విసిగి యితర దేవతా ప్రభావములు విని వారి సేవలకై పోయియుండుటచే నప్పుడు సింహాచలము పూజా నమస్కారములు లేక పాడు దేవాలయములో బూజు పట్టియున్న దేవతావిగ్రహము వలెనే యుత్సవములు లేక నల్లమందు కైనను సరిగా వచ్చుబడిలేక ప్రాతగుల్ల లొక్కొకటే యమ్ముకొని జీవనము చేయుచుండగా దాని పాలిటి దైవమువలె గంగాధరుఁడు వెళ్ళి యాదుకొని యప్పుడప్పుడు