ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

గ ణ ప తి

ఇట్లు యాయవర మాధుకర వృత్తులచేతను బ్రాహ్మణార్ధములచేతను గంగాధరుఁడు తనపొట్ట బోసికొని మాతృసం రక్షణముఁ జేయుచుండెను. అట్లు కొంతకాలము నడచెను. గంగాధరునకు మిక్కిలి ప్రియమైన యుల్లిపాయ యొక్క వాసనవలె యతనికీర్తి యెంత కప్పిపుచ్చినను దాగక నలుదెసల వ్యాపించెను. తలుపులు వేసికొని తెల్లవారు జాముననె యెవ్వరు జూడకుండ నతఁడు తరవాణి యన్నము మిక్కిలి రహస్యముగఁ దినుచున్నను లోకులెట్లో యా విషయము గ్రహించిరి. నాలుగుగోడలనడుమ జరిగిన యారహస్య వృత్తాంతము బయట వడుటచే లోకు లనుకొనునట్లు గోడలకు చెవులే గాక నాలుకకూడ నున్నదేమో యని సందేహింపవలసి యున్నది. బ్రాహ్మణార్థములకు వెళ్లినప్పు డపరాహ్నము తిరిగెనేని తక్కిన బ్రాహ్మణు లాఁకలిచేత గిలగిల లాడుచుండగా గంగాధరుఁ డాకలిదప్పికలు లేక ఱాయివలె గూర్చుండుటచేతను వానినో రప్పుడప్పుడు ఉల్లిపాయ కంపు గొట్టుచుండుటచేతను నతఁడు తరవాణితో నభిషేకము జేసి చల్దికూఁడు నైవేద్యము పెట్టి యాత్మారాముని సేవించి యుండునని గ్రామవాసు లూహించి యొకటి రెండు సారులతనిని బిలిచి యడిగి దూషించి యతనిని బ్రాహ్మణార్థములకుఁ బిలుచుట మానిరి. కొంద ఱాతనికి వెలియని తమయిండ్ల శుభ కార్యములకు సయితము రానీయక పోయిరి. కొందఱు మాధుకరము పెట్టుట మానిరి. యాయవరము నందు సయిత