ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

గ ణ ప తి

గున్నవలెనుండెను. ఏనుగుల మహలునకు రాకమునుపె గంగాధరున కుపనయనముఁ జేయవలయునని పిచ్చమ్మకు సంకల్పము కలిగెను.

బ్రాహ్మణకుమారునకు గర్భాష్టమునం దుపనయనము జేయవలయునని ధర్మశాస్త్రమునం దుండుటచేత నామెకుమారున కేడవయేఁట నుపనయనముఁ జేయఁదలంచెనని చదువరులూహింప వచ్చును. ఆ యూహ సరికాదు. గర్భాష్టమ మేమొ ధర్మశాస్త్రమేమొ పిచ్చమ్మకుఁ దెలియదు. ఉపనయన సంకల్పమున కొక్కటే కారణము గలదు. పేదతనము ప్రధానకారణము. అన్నవస్త్రములకు వారికి మిక్కుటమైన యిబ్బంది కలిగెను. గంగాధరుడు వయసున బిల్లవాడెకాని భోజనవిషయముఁ బెద్దవాఁడని చెప్పవచ్చును. ముమ్మారు మూఁడుసోలల బియ్యమతని కొకవిధముగ సరిపోవుచుండును. తల్లి వితంతువగుటచే మధ్యాహ్న మొకసోలడు బియ్యపన్నము మాత్రమె తిని రాత్రి యుపవసించు చుండును. మొత్తముమీఁద గావలసిన శేరుబియ్యమైన వచ్చెడిదారిలేదు. ఉపనయనము చేసెడు పక్షమున రెండుగ్రామములలో బ్రాహ్మణార్థములు చేయవచ్చును; పొత్తరలు పట్టవచ్చును. ద్వాదశీ బ్రాహ్మణుఁడుగ నమావాస్య బ్రాహ్మఁణుడుగ నుండవచ్చును; సంభావనకు వెళ్ళవచ్చును. కుమారుఁ డీవిధముగఁ దనపొట్టఁదాను బోసికొనుచున్న పక్షమున పిచ్చమ్మ తానెవరింటనైన చేరి వుదరపోషణముఁ జేసికొన వచ్చు