ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

83

పోవుచు నిన్ను నీ బిడ్డను నా మెడకు గుదికఱ్ఱవలె గట్టిపోయినాడు." అని పలుకఁ దనపని వట్టిదయ్యెనని తెలిసికొని పిచ్చమ్మ కొంతసేపు వలవలయేడ్చి కొంత దుఃఖోప శమనమైన తరువాత "సరే; యిల్లు తనఖాపెట్టి రూపాయలుతెచ్చి యిచ్చి వెళ్ళు. తరువాత దైవమే యున్నాఁడని తన బిడ్డను దీసికొని గదిలోనికి వెళ్ళిపోయెను. ఆ మరునాఁ డన్నప్ప మనుమనిపక్షమున గుమార్తెను సంరక్షకురాలుగా నేర్పరచి యామెచేతనే నిశానిబెట్టించి నూరురూపాయ లిప్పించి తన బత్తెఖర్చుక్రింద రెండు రూపాయలుమాత్రమందులోనుంచి తీసి రెండుదినముల తరువాత మందపల్లి విడిచి మూలస్థానమునకు సకుటుంబముగఁ బోయెను. తరువాత మాసికములు పెట్టుటకుగాని తదితర కార్యక్రమములకుగాని యన్నప్పమందపల్లివచ్చుట కెంతమాత్రము దీరిక లేకపోయినది. పిల్లవానికి జబ్బుచేసినదని పిచ్చమ్మ వర్తమానము పంపినప్పుడైనను వచ్చి చూచిపోవుటకు సయిత మన్నప్ప కవకాశము గలిగినదికాదు. బహు కార్యాభారము పైన వేసికొన్నవారికి బంధుసమాగమము దుర్లభముకదా. పాపయ్యయొక్క సంవత్సరీకమున కైనను మామగారు రాఁజాలకపోయెను. మందపల్లిలోనున్న కాలమున నల్లునికి ప్రతి మాసిక మాసికమునకు మిక్కిలి శ్రద్ధతో నన్నప్ప నెతిగారెలు గారపుగారెలు కరకరలాడునట్లు మఱియొక వెపు రానిచ్చి వండవలసినదని వంటలకువచ్చినవారితో జెప్పుచుండుటచేత గారెలమీఁద ప్రేమచేతనైన సంవత్స