ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

73

యతని కిష్టములేదు. చేతులార పిల్లను వదలుకొనుట కంత కన్న నిష్టములేదు. కొన్ని దినములు వితర్కించి వితర్కించి యెట్టకేలకు మిత్రుల ప్రోత్సాహమున మూఁడు వందలరూపాయలలు మూటగట్టి సీతారామయ్య చేతనే పంపెను. వెండిబంగారములు బరిశుద్ధ పదార్థములె కావున స్వీకతించినవారి మనస్సులు గూడ పరిశుద్ధములు చేయును. రజతదర్శనము చేత నన్నప్ప కోపమంతయు నుపశమించెను. వివాహము పెండ్లి కొడుకువారియింట జరిగినప్పుడు పునస్సంధానముగూడా నచ్చట జరుపవలెనని యన్నప్ప నియమముఁ జేసికొని సకుటుంబముగ మరల మందపల్లి వెళ్ళెను. బ్రహ్మచర్యమువదలి భార్యతో నేకమైనం జాలునని పాపయ్యవారిని సగౌరవముగ నెదుర్కొని తీసికొనివచ్చెను. ముహూర్తమేర్పడెను. పునస్సంధానమయ్యెను. క్రొత్తపిల్ల యగుటచేత సిగ్గుపడుననియు మగనిదగ్గఱ బెదురు తీరలేదనియు వంట నేర్పవలసియున్న దనియుజెప్పి యన్నప్ప గర్భాదానమైన యాఱుమాసములవఱకు మందపల్లిలో నుండెను. మామగారి కోపపు వేఁడిమి మున్నూరురూపాయలను గ్రక్కించినందున నీసారి పాపయ్య నోరెత్తి పలుకలేదు. అత్తగారి యిష్టప్రకారము మామగారి యిష్టప్రకారము నడచుకొనెను. అంతలోనన్నప్పగారి పూర్వజన్మసుకృతము చేతనో ఈజన్మసుకృతము చేతనో పిచ్చమ్మకు నెలతప్పెను. వేవిళ్ళు ప్రారంభమయ్యెను. వేవిళ్ళబాధ పడుచు నిజముగ నొకపట్టెడన్నమైననుదినక మంచము మీఁదనుండి సరిగ లేవకయున్న