ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

51

దింపలేనివాఁడు, పిత్రార్జితము నమ్ముకొని కాలక్షేపము సేయువారు, వట్టి యప్రయోజకులు. నేను గట్టిప్రయోజకుఁడను, నాభుజశక్తివల్ల జీవనముచేయుచున్నాడను. పల్లకి మోయుట యెటువంటిదో కటుకు మోయుట యటు వంటిదె. పెండ్లి పల్లకి మోతకు డబ్బుపుచ్చుకొనుట న్యాయమై దీనిమోతకు డబ్బు పుచ్చుకొనుట యన్యాయమగునా? నా వలన మీకు తలవంపులు వచ్చుచున్నవా? తెనుఁగువాళ్ళు మరెందుకుఁ బనికిరారన్న యపకీర్తిఁ దొలఁగించి యేపనిలోఁ బెట్టినను సరె తెనుఁగువారు సమర్థులేయని లోకములో వెల్లడిఁ జేసినాను. అందుకైన నామీద మీకు విశ్వాసము లేదే! ఛీ! మీతో మాట్లాడఁ గూడదు. పొండి” అని యెదుటివాఁడు మరల నోరెత్తలేనట్టు యుక్తులు చెప్పి తన యుక్తులు చాలనప్పుడు తన తొమ్మిదవ యఠ్ఠము పారాయణముఁ జేసి “శేషం కోపేన పూరయేత్” అను మాట సార్థకముజేయుచుండెను. పాపయ్య యే సుదినమున నే మంచి ముహూర్తమునఁ దనవృత్తి నారంభించెనో కాని యది దిన దిన ప్రవర్థమాన మయ్యెను. పునహా పెద్దపట్టణ మగుటచేఁ బ్రతిదినమతఁడు రెండు మూఁడు పరియాయములు రుద్రభూమికి బోవలసిన పని గలుగుచుండెను. మశూచి విశూచి వచ్చిన కాలములో నతఁడు భూతగణపరివృతుఁడైన సాక్షాత్ రుద్రుఁడు వలె శిష్యసమేతుడై తరుచు శ్మశానములలోనే యుండుచు వచ్చెను. పని తొందరచే నొకానొకదిన మతఁడు భోజనముఁ జేయక పోవుటయుఁ దన పొలములోనికే యన్నము దెప్పించు