ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

41

కలవు. ఎన్నో తరములనుండి వంశపారంపర్యముగ వచ్చుచున్న యక్షయపాత్ర యుండవలయును గదా. అది యేమైనదని మీకు సందియము దోఁచవచ్చును. పాపయ్య బద్ధకముచేత నక్షయపాత్ర వ్యాపారము మానికొనెను. వ్యాపారము మానికొన్నను జాలకాలము నాఁటనుండి యచ్చివచ్చినపాత్ర దాచకూడదాయని మీకు సందేహము దోచవచ్చునేమో; అది తల యుత్తరించుకొని పోవు సమయమున కుపయోగింపబడెను. చీట్లపేకలో వచ్చిన దండుగ నిచ్చుకొనుట కాపాత్ర నుపయోగింపఁ బడెను. అది యొక్కటియె గాదు, అప్పుడప్పుడు హస్తలాఘవముచే నతని వశమగుచుండిన రాగి కంచు చెంబులు పంచపాత్రలు మొదలగునవి గూడ తన్నిమిత్తము వినియోగింపఁబడెను. పెట్టెలు లేవా యని మీ రడగవచ్చును. పెట్టెలలో దాఁచవలసిన వస్తువులు లేనప్పుడు పెట్టెలెందుకు? అందుచేత నతనికి సర్దుకోవలసిన సామగ్రులు లేకపోయెను. చిరకాలమునుండి బూజు పట్టుచున్న కృష్ణాజినమును దర్భాసనమును దీసి పాపయ్య బూజు దులిపి యెండలో వేసి దర్భాసనమును కృష్ణాజినములో వేసి కట్టి యొకనాఁడు తెల్లవారుజామున నా కృష్ణాజినమును భుజముమీఁద వేసికొని యిత్తడి చెంబు మూతికి గట్టిన యంగవస్త్రమును నడుమునకు గట్టుకొని ప్రాతధోవతిగట్టుకొని తలకొక ప్రాతయుత్తరీయమును జుట్టుకొని పునహాకుఁ బయన మయ్యెను. మార్గమధ్యమున