ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

355

కాఁబట్టి నీవా సొమ్మిచ్చి వీరి పిల్లను చేసికో. పైగా వారు తమ పిల్ల నిక్కడికి తీసికొనివచ్చి మీ యింట్లోనే వివాహము చేయుదురు. వారు పూర్వము గొప్ప సంసారులె కాని వారి పెద్దలు చ్క్షేసిన క్రతులవల్ల దానధర్మములవల్ల సంసారము చితికిపోయినది. అందుచేత నలువది వరాల సొమ్ము నీదగ్గఱ పుచ్చుకొని మీ యింటికే వచ్చి పెండ్లిచేయవలసి వచ్చినది. కాని లేకపోతే వీథులు కట్టి విస్తళ్ళు వేసి సంతర్పణ చేసి కలియుగవైకుంఠముగ వారు వివాహము చేయగలవారె. సరే, ఆ మాటలెందుకు? ఇప్పుడు పెద్దమనుష్యుల నెవ్వరినైన తీసికొనిరా, తాంబూలములు పుచ్చుకుందము. 'ఏమండీ దీక్షితులుగారు! పిల్ల వానిని మీరు చూచుకొన్నారుగదా' మీ కిష్టమేనా?" అనవుడు సగము తెల్లవెంట్రుకలు సగము నల్ల వెంట్రుకలు గల తన గడ్డము చేతితో నొకసారి దువ్వు గోవింద! గోవింద! యని రెండుసారులు భగవన్నామస్మరణముచేసి దీక్షితు లిట్లనియె. "మా పరువు ప్రతిష్టలు మా తండ్రితాతలతోనే పోయినవి. నేనిప్పుడు మా పెద్దలపేరు చెప్పుకొనక జీవచ్ఛవమునై యున్నాను. మా యాడుపిల్ల లందరిని ఇది వరకు నేను కన్యాదానము చేసినాను. ఇది కడగొట్టు పిల్ల. దీనిని గూడ నొక యయ్య చేతిలో బెట్టి నా భార్యను దీసికొని నేను కాశీ వెళ్ళి యక్కడ నివాసము జేయఁదలఁచుకొన్నాను. ఆ యాత్ర బత్తెకర్చులకే యీ నలువది వరాలు