ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

349

"పంతులు గారూ! మీరు పని చేయించుకొం" డని యందొకఁడు చెప్పెను, "తల మాయలేదు. నేను పనిచేయించుకొన" నని యత డుత్తరము చెప్పెను. అప్పుడిద్దరు శిష్యులు చెరియొక చేయి బట్టుకొనిరి. ఇద్దరు కాళ్ళు త్రొక్కిపెట్టి పట్టుకొని మంగలివానిని పనిచేయు మని జెప్పిరి. అంతట మంగలివాఁడు క్షురకర్మ నారంభించెను. గణపతి మంగలివానిని, విద్యార్థులను దిట్టుచు దక్షిణ దేశపు గాయకుడు త్రిప్పినట్టుఁ తల యిట్టట్టుఁ బలుమారు త్రిప్పెను. మంగలివాఁడు ప్రయత్న పూర్వకముగ నాటులు వేయకపోయినను గణపతి శిరము వేమారు త్రిప్పుటచే నాలుగైదు నాటులు పడెను. అంతలో మరి నలుగురు విద్యార్థులు నాలుగు బిందెలు తీసికొనివచ్చిరి. సింగమ్మకూడ వారితో వచ్చెను. ఆ వార్త గ్రామమున బ్రకాశిత మగుటచేత బనిపాటలు లేనివాండ్రు వినోదము చూచుటకై కాలవయొడ్డున జేరిరి. నిమ్మపళ్ళ పులుసుతో మంగలివానిచేత తల రుద్దించి విద్యార్థులు గురుభక్తి తత్పరులై వందలకొలఁది బిందెలనీరు వాని తలపై బోసి "యీ దెబ్బతో మీ పిచ్చి వదులునులెండి!" యనుచు నించుమించుగ సహస్ర ఘటాభిషేకమూ జేసిరి. నడమ నడుమ సింగమ్మ "నాయనా! పిచ్చి పూర్తిగ వదిలినదాక నీళ్ళు పోయండి!" యని వారిని హెచ్చరించుచు వచ్చెను. " నాకు పిచ్చి లేదురోయి! వదలండిరోయి!" యని గణపతి కేకలు వేయజొచ్చెను, "అదే పిచ్చిమాట, నాయనా! పిచ్చి లేదన్నమాటే పిచ్చ" యని సింగమ్మ