ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

343

యిట్లనియె. "ఒరే అబ్బాయిలారా ! నేను కష్టపడి చదువు చెప్పినందుకు మీ కున్నది విశ్వాసము. తక్కినవాళ్ళలో నొక్క ముండాకొడుకు కయిన నున్నదా? ఒక్కరికీ లేదు సుమా. ఈ కలియుగములో విశ్వాస ముంటుదిట్రా! ఒక్క లమ్డీకొడుక్కైన లేదురా విశ్వాసము! యెంతకష్టపడి చదువు చెప్పినానురా మీకు? నా మూలముననె గాదట్రా, మీరింతంతవా ళ్ళైనారు. మీ విశ్వాసమునకు నేను సంతోషించినానురా. మీ యాలోచన బాగున్నది. ముత్యాల కుచ్చులున్న పల్లకి తెప్పిచండి. బోయలు వోం వోం వోం వోమ్మని బాగా కేకలు వేయాలి. కాగడాలు రెండు చాలవు. నాలుగై దుండవలెను. డోలు వీరణము సన్నాయి తోనే కడతేర్చక రమడోలు మేళము తాషామర్పాలు బాకాల జోడు కూడ తెప్పించండి. చూడు, వొరే వెంకటప్పా! మీ బాబయ్య చుట్టుకునే యెఱ్ఱతలగుడ్డ జరీది, తీసికొనివచ్చి జరీపట్టీలు పైకి బాగా కనబడునట్లుగా చుట్టి నా తలమీఁద పెట్టండి. పట్టుకోటెక్కడైనా తెచ్చిపెట్టండి. జరీపంచి, జరీకండువా కావలెను. అవి యింకొకరు తీసికొనిరండి. లేకపొతే చాకలి సరివిగాడికి నాలుగు డబ్బులిచ్చి తీసుకొనిరండి. ఇవి తెచ్చి సింగారం చేసి యాపైని నన్ను చూడండి. పల్లకిలో మహారాజు కొడుకులాగ ఎంత ఠీవిగా యెంత దర్జాగా కూర్చుందునో, కాగడాల వెలుతురున నా మొగమెంత ధగ ధగ మెఱయునో, నేనేలాటి నవ్వులు నవ్వుదునో, యేలాటి చూపులు చూతునో, చూడండి తమాషా