ఈ పుట అచ్చుదిద్దబడ్డది

340

గ ణ ప తి

నకు వచ్చి 'రామదాసు చరిత్రము బాడినపుడు చారెడు బియ్యము వారికి పెట్టి, రెండుమూడు కీర్తనలు వినుచుండును. ఆ కీర్తనలలో, 'యెందుకైనా యుంచినావు బందిఖానలో' నను నట్టి వామెకు మిక్కిలి యిష్టము. విద్యావిహీనులైన బైరాగులు శబ్దములు స్వచ్ఛముగ నుచ్చరింపలేక, 'వ్రెందుకైనా వుంచినావూ బ్రందిఖానలో' అని పాడుచుందురు. సింగమ్మ వారిదగ్గర నా పాట నేర్చికొని వారివలెనే 'వ్రెందుకైనా వుంచినా' వని తప్పుగా పాడుకొనుచుండును. ఒకనాఁడామె తన ప్రాత నులకమంచము మీఁద వెన్నెలలో బండుకొని యా పాట పాడుకొనుచుండగా గణపతి వచ్చి, "ఓసి నీపాట తగలెయ్య! అదేమి పాటే? బ్రాహ్మణముండవు కావటే! పాడదలచుకుంటె ఎందుకైనా వుంచినావు బందిఖానాలో నని స్వచ్ఛముగ పాడు. లేదా నోరు మూసికొని యూరుకో" యనిపలికెను. 'నా పాటజోలి నీ కెందుకురా? నాకు వచ్చినట్లు పాడుకొనుచున్నాను. నీ కిష్టమైతే విను. లేకపోతే యావలకు లేచిపో!' యని యామె బదులు చెప్పెను. "అపస్వరములు పాడి పాట తగులపెట్టి నేను దిద్దితే పైగా నామీఁద కోపపడతావా? ఓసీ కోపిష్టిముండా! అపస్వరాల పాట యెప్పుడూ పాడవుగదా? పాడవుగదా?" యని నాలుగు చెంపకాయలు కొట్టెను. ఆమె కుమారుని మనసులో దూషించుచు, గోలు గోలున మనసులో నేడ్చెను. ఒకనాడు కొట్టినాడు గదా, మరల వానియొద్ద నిట్టి పాటలు పాడ గూడదని యామె