ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

33

భేదజ్ఞానము నశించి పరవస్తువు లన్నియుఁ దన వస్తువులే యని నద్వైతభావము గలుగుట యెంత గొప్పమాట! అది యెంతవానికి లభియించును! పూర్వయుగములలో నట్టిబుద్ధి యనేకుల కుదయించి యుండవచ్చును, కాని కలియుగములో నది మందపల్లి నివాసుడగు పప్పుభొట్ల పాపయ్యకే సిద్ధించినది, నాణెములు కాని చెంబులు కాని వెండిగిన్నెలు కాని వస్త్రములు కాని తినియెడు పదార్థములు కాని యతని కంటఁబడెనా యెప్పుడో యవి యతనిచేత బడినవే. నీ వీ వస్తువు దీసితివా యని యెవరైన నడిగిన పక్షమున నతఁడు స్పష్టముగ లేదని చెప్పుచుండును. లేదనుటలో నతఁ డబద్ధమాడెనని యెవ్వరు దలంపఁ గూడదు. "గజం మిధ్య పలాయనం మిధ్య" యన్నట్లు వస్తువులేదు. దొంగతనము లేదని యభిప్రాయమై యుండవచ్చును. లోకులు కాకులవంటివారు కదా! పాపము ! పాపయ్య లేమిచేతనో యద్వైతభావము చేతనో హస్తచాపల్యము చేతనో చిరతరాభ్యాసము చేతనో హస్తలాఘవముఁ జూపు నభిలాష చేతనో గ్రామములలో నున్న కొన్ని యిండ్లలో జొరబడి కొన్ని వస్తువులను గ్రహించినాఁడనుకొనుఁడు. గ్రామవాసులు తమ పుట్టియంతయు మునిగిపోయినట్లు పెద్దగోలచేసి యతని నల్లరిపెట్ట దొడఁగిరి. పరుల వస్తు వేమిటి మన వస్తు వేమిటను భావము పాపయ్య కున్నట్లు వస్తువులు మన యింట నుండిననేమి పాపయ్య యింట నుండిన నేమి యను భావము గ్రామవాసులలో