ఈ పుట అచ్చుదిద్దబడ్డది

338

గ ణ ప తి

కారిముండా! అంత చిన్నముండను నేను పెండ్లి చేసుకుంటానటే? అది యెన్నడెదుగును? ఎన్నడు కాపురమునకు వచ్చును? ఈ లాటి వెధవమాట లాడకు!" మని యెడమ చేతితో రెండు మొట్టికాయలు మొట్టెను. పాప మా ముసలియవ్వ యూ రెండు మొట్టికాయలతో నెంతో సేపు తల తడుముకొనుచు నేడ్చి "నీకిదేమి వినాశకాలమురా? నీ పెండ్లి పెటాకులు చేయవలెనని నేను మంచి యాలోచన చెప్పితే నీవు నన్ను కొట్టినావు? నీ పెళ్ళి మండిపోనూ, నా కెందుకు!" అని దూషణపూర్వకముగా విలపించుచుండ "ఓసి దొంగముండా! నన్ను తిట్టుచున్నావా!" యని చెంబులో నున్న నీళ్లామె నెత్తిమీద పోసి యన్నము విడిచిపెట్టి లేచిపోయెను. అది యైన మరి నాలుగు దినముల కొకనాటి రేయి గణపతి భోజనము చేయుచుండ మరల సింగమ్మ యిట్లనియె. "నాయనా! మన రామావధానుల కూతురకు సంబంధము దొరకలేదుట. తగిన వరుఁడు దొరికితే యివ్వవలె నని యున్నాడట! నీ వెవ్వరచేతనైనా పిల్లను నీకివ్వమని వర్తమాన మంపించరాదూ? నాయనా! నే బ్రతికియుండగా నొక యింటి వాఁడవైతే చూడ వలెనని యున్నది." అనుటయు గణపతి "వారెందుకు, వీరెందుకుకే? నీవే వెళ్ళి మా పిల్లవానికి మీపిల్ల నిమ్మని యడుగు. రామావధానులు మన సంబంధముకంటె యెక్కువ సంబంధము తేగలఁడా యేమిటి?"యని యుత్తరముచెప్పెను. అందు కామె వెండియు నిట్లనియె. "అది కాదు నాయనా! నేను వెళ్ళి యడిగి