ఈ పుట అచ్చుదిద్దబడ్డది

322

గ ణ ప తి

లేకపోవుటచే గణపతి చుట్టుప్రక్కల కరిగి యొక పుల్ల దెచ్చి దానితో గలియబెట్టెను. దైవవశమున నది వేపపుల్లయయ్యెను. పప్పులో నుప్పెక్కువ యయ్యెను. పైగా నది యెనుపక పోవుటచే బద్దలు బద్దలుగా నుండెను. చారు కాచెను. కాని యది కంసాలులు వెండి వస్తువులు మొదలగు వానికి వన్నెదెచ్చుటకై యుడుకబెట్టెడు చింతపండు పులుసు వలె రుచిలేక చూడ నసహ్యమై యుండెను. యజమానుఁడు స్నానముచేసి వడ్డించుమని కూర్చుండ, గణపతి గిన్నె దెచ్చి యా వేపపుల్లతోనే వడ్డించుటకు బ్రయత్నము చేసెను. కాని విస్తరిలో నన్న మూడిపడదయ్యెను. గిన్నె నేలబెట్టి కొట్టి వేపపుల్లతో బొడిచి పొడిచి నానా బాధలు పడునప్పటికి పారణపు ముద్దవలె రెండుండ లూడిపడెను. ఆ తరువాత గణపతి పప్పు వడ్డించెను. అన్నము చిదుపుటకు యజమానుని తరము గాకపోయెను. చేయి వై చునప్పటికి నిప్పుమీద చేయి వైచిన ట్లంటుకొనెను. విసనకఱ్ఱఁ దెచ్చి కొంతసేపు విసరిన తరువాత నన్నము చల్లబడెను. కాని యజమానుఁడు ప్రాణాహుతులు పుచ్చుకొను నప్పటికె యన్నము యొక్క రుచి తెలిసెను. వేపగింజలు వండిపెట్టి నట్లుండెను. కాని యన్నము వండిపెట్టినట్లు లేదు. తరువాత యజమానుఁడు పప్పు నోటబెట్టెను. ఉప్పులో నాలుగు పప్పుబద్ద లడ్డమువేసి యతఁడు వండెనో, పప్పులో చెరిసగ ముప్పువేసి వండెనో కనిపెట్టుట బ్రహ్మదేవుని తరముకాదు. అన్నము, సూపము రుచి