ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

315

వారెగతాళి చేయుచుఁ బలికిరి. వారు తన్ను బరిహాసముచేయుచున్న వారైనను నా బాలిశుఁడు గ్రహింపలేక దేశ మందరు తన్ను గౌరవించునట్టి మహాపదవిలోనికి వచ్చినట్లు సంతసించి యా వార్త తల్లికి జెప్పెను. అది విని యామె తన కొడు కేనుఁగు నెక్కినట్లు సంతసించి "నాయనా! మంచిపని సంపాదించినావు. నీ కింత గొప్పతనము పట్టినందుకు ఈ యూరివారందరు కన్నులలో నిప్పులు పోసికొంటారు. దిక్కుమాలిన బడి పోతేపోయిందిలే, దాని తాత వంటి పని వచ్చినది. నే నిక్కడనే సోలెడు బియ్యము కాచుకొని కాలక్షేపము చేయుచుండెదను, నీవు వెళ్ళిరా!" యని యన్నము పెట్టిపంపెను. గణపతి తన గుడ్డలు నాలుగు మూటగట్టుకొని తన స్నేహితులం బిలిచి "యీ చుట్టుప్రక్కల గరుడాచలం భాగవతం కట్టిందంటె నేను కృష్ణవేషము వేసినా నన్నమాటె. మీరందఱు నా కోసమైనా భాగవతం చూచుటకు రండి! నా వేషమెంత దర్జాగా యెంత ఠీవిగా నుంటుందో మీరు చూతురు గాని! అల్లరి చిల్లరి వెధవలు వేషము కట్టినట్లు కడతా ననుకున్నారా యేమిటి? ఎంత చమత్కారముగా నుండునో నా వేషము చూచిన తరువాత మీకే తెలియఁగలదు. తప్పక రండి." యని ప్రత్యేకముగ నొక్కరొక్కరితో జెప్పి గరుడాచలముతో బయలుదేరి పలివెల వెళ్ళెను.

ఆ యూరు వెళ్ళిన తరువాత గణపతి గర్వము మేఱమీఱెను. 'మీ రెవ్వరండీ!' యని యతని నెవ్వరైన క్రొత్తవా