ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

307

మేము చేసిన పని గాదని విద్యార్థులు గురువుగారిమీద నొట్టు పెట్టుకొని చెప్పిరి. గణపతి కా మాటలే విశ్వాసపాత్రములైనను మహాదేవశాస్త్రి నాఁటంగోలె విద్యార్థులను లోపలికి రానియ్యగూడ దని నొక్కి వక్కాణించెను. మఱి యొకనాడు మహాదేవశాస్త్రి సకుటుంబముగా బంధుగృహమున జరుగు వివాహము నిమిత్తము పలివెల వెళ్ళెను. ఇంటిలో గణపతియుం దల్లియు మాత్రముండిరి. దల్పులన్నియు వైచుకొని రాత్రి తల్లికొడుకులు నిద్రపోవుచుండగా దొడ్డిలో నున్న తాటియాకుల పాక యంటుకొనెను. చుట్టుప్రక్కల నున్న జను లందరు లేచి కుండలతోను; బిందెలతోను నీళ్ళు తెచ్చి యది యార్పఁ బ్రయత్నించిరి. పెద్ద గోల యయ్యెను. తలుపులు తీయుమని సింహద్వారము వొద్ద దొడ్డిగుమ్మమువొద్ద నాకసము మాఱుమ్రోగునట్లు గ్రామవాసులు పెద్దపెట్టున నఱచిరి. కాని గణపతికి గాని తల్లికిఁగాని మెలఁకువ రాలేదు. గ్రామీణులలోఁ గొందఱు గోడ దూకియు దొడ్డిగోడ దూకియు గొందఱు నిచ్చెనలు వైచుకొని లోనికి దిగియు దొడ్డి తలుపులు దీసికొని యంటుకొన్న పాక చల్లార్చిరి. కాని గణపతికి మెలకువ రానందున సాహసులు కొంద ఱుతకలెత్తి తలుపులు తీసి గణపతిని లేపబూనిరి. గాని యంతకు నతనికి మెలకువ రానందున నతని చెవిలోఁ జల్లని నీరు పోసిరి. అప్పు డతడు మేల్కొనియెను. మఱియొకసారి గణపతి మహాదేవశాస్త్రిగారితోఁ గలిసి రాత్రి బండిమీఁద బయనమై వెళ్ళు