ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

గ ణ ప తి

దేవుఁడు నా కెందుకు పెట్టినాడు కాదురా, నాయనా! నీకు పెండ్లిచేసి నీ వొక యింటివాఁడవై యుండగా నా కన్నులు చల్లగా చూడవలె ననుకొన్నానురా, నాయనా! బ్రహ్మచారివై చచ్చిపోవలసి వచ్చినదిరా, తండ్రీ! నీ పేరుగా చూచుకొనేందుకు నీ కడుపున నొక పిల్లవాఁడైన లేకపోయెరా, నాయనా! నీ వెవరిజోలికి వెళ్ళనివాడవురా, నాయనా! నీ మీఁదింత కోపము మెవరికి వచ్చిందిరా, నాయనా! ప్రాణము పొయ్యేటప్పుడు నన్ను దలఁచుకొని యెంత దుఃఖపడ్డావో, తండ్రీ! నీ ప్రాణమెంత కొట్టుకున్నదో, నాయనా! దిక్కిమాలినముండను నేను లోపల పడుకొన్నాను గాని వీథిలో పడుకున్నానుకానురా, నాయనా! నీ కిన్ని పాట్లుండబట్టే భగవంతుఁడు నాకటువంటి పాడుబుద్ధులు తోపించాడురా, నాయనా! ఆ నాగన్న వెధవ, ఆ గంగమ్మ ముండ యీ వార్త విని సంతోషముతో పరమాన్నము వండుకొని తింటారురా, నాయనా! నేనేలాగున బ్రతకనురా, బాబూ! నిన్ను రాజులాగు పెంచుకొన్నానురా, బాబు! అవతారమూర్తి అనుకున్నానురా, నాయనా! ఎవరు దగ్గరవుంటే నీ దగ్గరున్న ట్లుంటుందిరా, నాయనా! దాహం తాగితే మానెడు తరవాణి త్రాగేవాడవురా, నాయనా! నీవు చద్ది అన్నము తినేవేళైనది లేరా, నాయనా!" అని పరి పరి విధముల దుఃఖించెను. తల్లి పెద్ద గొంతుకతో నెల్లవారి గుండెలు నీరగున టేడ్చుచున్నను,