ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

297

కనఁబడుచున్నది. చుట్టుప్రక్కల జుట్టములు పక్కములు లేరు. నరసంచారమే లేదు. నిప్పు లేదు. కుండలు లేవు. మోసినవారు లేరు. కాడు పేర్చలేదు. పుల్లలు లేవు. పిడకలు లేవు. కూనీ యైన శవమేమో యనుకొందమన్న నట్టి శవమును నే తుంగలోనో త్రొక్కి పారవేయుదురు. గాని యింత జాగ్రత్తగా నొక కటుకుఁ గట్టి మోసికొని తీసికొనివత్తురా! ఇది యేమో మాయగా నున్నది. ఈ విషయమై నేను పోయి మునసబు, కరణాలతోఁ జెప్పి దీసికొనివచ్చెదను." అని పరుగునఁ బోయి మునసబు కరణాలని లేపెను. ఈ లోపున మరికొంద ఱా మార్గమునం బోవుచు, నప్పటికి మొగ మానవాలు పట్టుటకు దగినంత వెలుతురు వచ్చినందున దగ్గఱకుఁ బోయి కటుక మీఁదనున్న విగ్రహముం జూచి పంతులుగారి నెవరో చంపి పడవైచి రని కలఁతజెందిన మనస్సులతో వెనుకకుఁ బోయి గ్రామవాసులతోఁ చెప్పిరి. ఆ వార్త గ్రామమంతయు గుప్పుమనెను. స్త్రీలు మిక్కిలి యక్కజముతో జాలి పెంపున గన్నీరు విడుచుచు "అయ్యో! తల్లి కొక్క బిడ్డమ్మ, ఆ ముసలిముండ ముప్పు గడపకుండ బోయినా డమ్మ! ఇంత పని చేయుటకు వాళ్ళకు చేతు లేలా గొచ్చెనో యమ్మా! అయ్యో ! బెత్తము పుచ్చుకొని పిల్లలను కొట్టుచున్నట్లే నా కన్నుల ముందర మెలఁగుచున్నాడే అమ్మా!" యని చెప్పుకొనజొచ్చిరి. పురుషుఁ లందరు నీ వార్త చెవినిఁ బడగానే యితరకృత్యములు విడచి స్మశానభూమికే పరుగిడిరి. ఎవరో