ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

285

వినమితగాత్రులయి తమ్ము శిష్యులుగఁ బరిగ్రహింప వలసినదని గణపతిని వేడి యతని యనుగ్రహపాత్రులై యతని శిష్యగణములో జేరిరి. చేరి వీలైనప్పుడు తా మల్లరిచేయుచు, వీలుకానప్పు డేదో చెరుపు చేయుమని తమకంటె జిన్నవాండ్ర బురిగొల్పుచు, వారు చేయునట్టి యల్లరి జూచి మహానందము నొందుచుండిరి. పెద్ద పిల్లలు చేరిన తరువాత చిన్నపిల్లలకు మునుపటికన్న ధైర్యసాహసములు హెచ్చెను. ఒకనాడు గణపతి శిష్యులకు తాను చిన్నప్పుడు నేర్చిన 'ఎవరయా మీరు చక్కనిరాజు లిద్ద ' ఱను పద్య ముక్తలేఖనము జెప్పదొడగెను. పదుగురుబాలకులది వ్రాయుచుండిరి. 'నేనన్నమాట మీరు మరల ననవద్ద 'ని గణపతి వారి కాజ్ఞ యొసగెను. ఆ యాజ్ఞ చెవి నిడక మొదటనున్న బాలకులు 'ఎవరయా మీవరని' గణపతి చెప్పగా 'యెవరయా మీరని' మరల ననజొచ్చిరి. గణపతి కోపావిష్టుడై యాబాలకుల తలలు గోడనుబెట్టి కొట్టి దండించుచుండగా జిట్టచివర నున్న బాలకులు మరల 'ఎవరయా మీరని ' పలికిరి. మొదటి వారిని వదలి గణపతి చివరివారిని దండించుటకయి రాఁగా మధ్య బాలకు లా విధముగ నరవజొచ్చెను. తాడనము చేయుటకయి వారి కడ కతఁడు పోగా మొదటి పిల్లలు జివరపిల్లలు గూడ నొక్కపెట్టున నఱచిరి. అప్పుడు గణపతి కోపావేశమున నిజముగ నొడలు మఱచిపోయి యా బాలకులలొ నొక్క బక్కవానిని బట్టుకొని చేయి నొచ్చువరకు చఱపులు చఱచి క్రింద