ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

271

తనములో మా గురువుగారు చేసిన శిక్షలలో నిది యెన్నోవంతు? ఒకనాఁడు మా గురువుగారు గరిటె కాల్చి వాతలు పెట్టినారు. ఒకనాడు ముంతపొగ పెట్టినారు. గోడదగ్గర నేను కూర్చుండగా నా తల గోడకుపెట్టి గొట్టినారు. ఒక నియోగుల కుఱ్ఱవానిని జునపములు పట్టుకొని కొట్టగా జునపము లూడి చేతిలోనికి వచ్చినవి. ఒక కుఱ్ఱవానికి పాఠము రాకపోతే చమురు కాల్చిపోసినారు. ఒక పిల్లవాడు చదువకపోతే కాల్చే కాల్చే చుట్టతో చంటిపిల్లలకు దెబ్బ వేసినట్టు వేసినాడు. ఇంత చేసినప్పటికి మేమేడ్వవలనుగాదు. నోట్లో గుడ్డలు క్రుక్కేవారు. పోనీ చంటిపిల్ల లేడ్చిపోదు రని జాలిచేత నట్టి పద్ధతు లవలంబించనే లేదు. పిల్లలంటే నాపిల్లలే. నేనుపూర్వపు వాళ్ళవలె నంత కఠినపద్ధతులు నేడవలంబించలేదు. నేనంత దయతో జూచుకొను నప్పటికి మీకు విశ్వాసము లేక నన్నడ్డమైన మాటలనుచున్నారు. ఒకమాటు పాఠము చదువకపోతే కంట్లో కారపు పొడి మిరపకాయ పొడి వేసేవారు. ఒక పరియాయము నేను బడికి రాక యాగడముసేయ జుట్టుకు త్రాడుపోసి నూతిలో దింపినారు. అంతంత శిక్షలుచేసి యాయన నాలుగు ముక్కలు చెప్పబట్టి నేనింత బాగుపడి యక్కఱకు వచ్చినాను. ఆ మహారాజు పెట్టిన దీప మిది. ఈ వృద్ధంతా యాయనదే. ఆయనకే దీపము పెట్టి మ్రొక్కవలె. ఈ గ్రామములో పిల్ల లందఱును నాయంత వాళ్లను చేయవలెనని తలంచుకోగా మీ రా పని సాగనియ్యక బాధ పెట్టుచున్నారు. పోనీ నా దేమి పోయినది? చదువు