ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

261

తరువాత వానపల్లిలో జీవన మెటులు జేయవలె నని ప్రశ్న వచ్చెను. వచ్చుటయు తల్లి కుమారుని జూచి 'నాయనా! యాయవారము జేసికొని బ్రతుకవచ్చును. అక్కడ మాత్రమిప్పు డందల మెక్కుచున్నామా యేమిటి? రెండు పొట్టలు గడవక పోవునా? బ్రతికితే బలుసా కేరుకొని తినవచ్చును. ఆ దుర్మార్గుని చేతిలో బడకుండ మరెక్కడ నున్నను మంచిదే. దుష్టులకు దూరముగా నుండు మన్నారు పెద్దలు!' అని చెప్పెను. చెప్పుటయు గణపతి చివాలున లేచి "నేను యాయవారము చేయను. ఎల్లకాలము యాయవారమేనా? నేను వట్టి పనికిమాలిన వెధవ ననుకొన్నావా యేమిటి, యాయవారము చేయుటకు? ఈ యూరిలో బడి లేదు. ఇక్కడ బడిపెట్టి చదువు చెప్పుదును. నాలుగు రోజుల నుండి నేను చూచుచున్నాను. పిల్లలందరు గాడిదల లాగున తిరిగి చెడిపోవుచున్నారు. వాళ్ళందరిని బాగుచేయవలె నని యున్నది. చెంబు మూల పడవైచి బెత్తము చేతితో పుచ్చుకోవలెను. ఇదే నా వృత్తి. ఈ యూరువారుకూడ బడిపెట్టు మని నన్ను బలవంత పెట్టుచున్నారు. మహాదేవశాస్త్రి గారు కూడ ఆమాటే అన్నారు. ఆయన నాకు వివాహ విషయములో యెంత యుపకారము చేసినారు! గనుక వారి గ్రామమునకు నే నీ యుపకారము చేయక తప్పదు. గనుక నీవు మన యూరు వెళ్ళి సామానులు తెప్పించు. ఆ నాగ్తన్నగా డున్న గ్రామంలో మన ముండకూడదు. వాఁడు వట్టి దుర్మార్గుడు. అతని మొగం