ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

25

కొబ్బరిచెట్టున్నను దాని కాయలు పప్పుభొట్ల వారివె. ఎవరిదొడ్లలో మంచిపాదులు పెట్టుకొన్నను వాని కాయలు పప్పుభొట్లవారివె. వారు చండశాసను లగుటచేత నిది యేమనుటకు వీలులేదు. ఇన్నిమాట లెందుకు? గణపతి పూర్వులు పురుష వృషభులు. అచ్చుబోసి విడచిన యాబోతులు సకల క్షేత్రములలో నెట్లు స్వేచ్ఛావిహారము సలుప వచ్చునో, పప్పుభొట్ల వారుగూడ నట్లె సకలగృహారామ క్షేత్రములలో విహారము చేయవచ్చును. కాని ప్రజల కాఁబోతులమీద మిక్కిలి భక్తియుండుటచే నవి తమచేలు మేయుట యిష్టము. పప్పుభొట్లవారియెడ భయము గలుగుటచే వారు తమసొత్తు హరించుట మనసులో నిష్టము లేకపోయినను భుజబలమున, వాగ్బలమున వారిని గెలువలేక మందపల్లి నివాసులూరకుండ వలసినవారైరి. మొత్తముమీద మందపల్లి గ్రామవాసులు భయభక్తులు గలవారని ప్రతిష్ట సంపాదించిరి. వారికి స్థిరాస్థి కొంత కలదని యీ ప్రకర ణారంభమున నుదాహరింపఁ బడినది. అది పితృపితామహార్జితమైన యాస్థి. అది దొంగ లపహరించుటకు వీలులేనిది. కావలసినంత శరీరపుష్టి చేయునట్టిది. ఎన్నితరములనుండి యనుభవించినను విఱుగు తఱుగు లేనిదగుటచే నక్షయము. అక్షయమనుటచేతను మ్రుచ్చు లపహరించుటకు వీలులేని దగుటచేతను శరీరపుష్టి చేయునదనుటచేతను భర్తృహరియొక్క వెఱ్ఱిమాటలు చదువుకొన్న వారు కొందఱు “హర్తకుఁగాదుగోచర” మను పద్యము