ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

257

వేసినాఁడు, వాడిచేతులు పడిపోను ! పోనీ విచారించకు, నాయనా పెండ్లి కాకపోతే బ్రహ్మచారివై యుందువుగాని, నాకంఠములో ప్రాణ మున్నట్టయిన నిన్నేదో విధముగ గృహస్థుని చేయక మానను; నీవు బెంగ పెట్టుకోకు" అని యూరఁడబలికి గణపతిని ముద్దు పెట్టుకొని, యతఁడు దోడ్కొనిపోవ మహాదేవశాస్త్రి గారి లోపలికిఁ బోయి శాస్త్రి యొక్కయు, వారి యాఁడువాండ్ర యొక్కయు సన్మానము బడసి యాపూట నచ్చట నత్తెసరు పెట్టికొని భోజనము చేసెను. భోజనానంతరమున మాతాపుత్రులు తమ భవిష్యజ్జీవనమున గూర్చి గట్టిగా నాలోచింపఁ దొడఁగిరి. ఏనుఁగులమహలులో నున్న పక్షమున మేనమామ తప్పక చంపి వేయు నని భయము పుట్టెను. మఱియొక చోటికిఁ బోయిన పక్షమున నక్కడ జీవనోపాధి యెట్లని సంశయము పొడమెను. ఆ పూట వారి కాలోచనలు తెగలేదు. నాఁటి రాత్రియు మరునాడును గూడ వా రా విషయమై యాలోచించిరి గాని యిదమిత్థమని నిర్ణయింపలేక పోయిరి.

పదిహేనవ ప్రకరణము

గణపతి మేనమామకూతుఁ నెత్తుకొనిపోయి దొంగ పెండ్లి చేసుకొనుటచేత నతఁడు నీచుఁ డని చదువరులు తలంచు