ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

251

అంతలోఁ జుట్టు ప్రక్కలవారందరుఁ జేరిరి. అప్పుడు తూర్పునఁ దెల్లవారెను. కాకులు కూయఁ జొచ్చెను. బుచ్చమ్మ మెడలో మంగళసూత్రము లగుపడెను. "ఇవిగో ! దీని మెడలో మంగళసూత్రము లున్నవి. ఎవరో తీసుకొని వెళ్ళి దొంగపెండ్లి చేసి కొన్నారు కాఁబోలు! ఎవరోగాదు. మాయచచ్చినాఁడు గణపతిగాడే యింతపని చేయగలవాఁడు. వీడి పెళ్ళి పెడాకులు గాను! ఎంతపని చేసినాఁడు. ఇవిగో! చూడండి పుస్తెలు!" అని గంగమ్మ మంగళసూత్రములు భర్తకుఁ దమ్ముఁ జూడవచ్చిన వారికిఁ జూపించెను. చూచి నాగన్న "ఔనౌను! ఇదిగో కాళ్ళకు బసుపు కూడ కనఁబడుచున్నది. కన్నుల కాటుక గూడ కనఁబడుచున్నది. పిల్ల యేడుపు వలన కొంతవరకు కాటుక కరగిపోయినది. పాప మెంత యేడ్చినదో యెంత బెంగ పెట్టుకొని నదో! "అమ్మా! నిన్నెవరు తీసుకవెళ్ళినారు? " అని కూతుఁనడిగె. మూఁడేండ్ల పిల్ల యగుటచే బుచ్చమ్మ మాటలు సరిగ రాక "వోరోబ్బి బన్నిమీద తీచికెళ్ళాడు." అని బదులుచెప్పెను. ఆమెను గణపతియే తప్పక తీసికొనిపోయి దొంగపెండ్లి చేసికొని యుండునని యచటివారందరు నిశ్చయించిరి. నాగన్నకు దుఃఖము కోపము మనంబున మల్లడిగొని నందున నవి యాపుకొనలేక పండ్లు పట పట గొరుకుచు "నోరెరుగని బిడ్డను దొంగతనముగా తీసికొనిపోయి పెండ్లి చేసికొని వీడు గృహస్థుడు కాదలచుకొన్నాడు కాఁబోలు! వెధవ పెండ్లి, బోడి పెండ్లి. ఆ వెధవ బ్రతుక్కు