ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

గ ణ ప తి

నాంక్షజేసి బాధించుటచే నక్కడ బాధపడలేక కుటుంబసహితముగా బహు గ్రామములు తిరిగి తిరిగి యెట్టకేలకు మందపల్లి జేరెను.

మూడవ ప్రకరణము

గణపతి పూర్వులకు స్థిరాస్తి కొంత కలదు. కాని యది లోకులందఱకుఁ గల స్థిరాస్తి కాదు. లోకములో స్థిరాస్తి యనగా భూములు మాన్యములు మొదలగునవి. పప్పుభొట్ల వారికిఁగల భూములు రుద్రభూములు, మాన్యములు సామాన్యములు. ఇంక గృహవిషయము విచారించితిమా యెప్పు డెక్కడ నివాసముగ నున్న నదియె వారి గృహము. అది మొదట వారి గృహము కాకపోయినను గ్రమక్రమముగఁ జిరకాల నివాసము చేత నది వారిదెయగుచు వచ్చెను. గృహయజమానులు వచ్చి వీరిని లేచి పొమ్మన్న పక్షమున వీరెప్పుడు లేచువారు కారు. బలవంతముగ వారిని బంపివేయుట మనుష్య మాత్రునకు సాధ్యము కాదు. అందుచేత మందపల్లిలో వారున్న యిల్లు భుజబలముచేత సంపాదింపఁ బడిన దని చెప్పవచ్చును. గణపతి పూర్వులు లోక కుటుంబులు. వారి గ్రామమంతయు వారి స్వగృహముగానే వారి చేత భావింపఁబడుచుండును. ఎవరిపొలముగట్టుమీఁద మామిడిచెట్టున్నను