ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

గ ణ ప తి

మొదట నమ్మినాము. తరువాత నా కీ రహస్యమంతయు నమలాపురపు బ్రాహ్మణుఁ డొకడు చెప్పినాడు. అది విని నరసయ్యను పిలిచి యడిగినాను. లేదు లేదని మొదట బొంకినాఁడు కాని చివరకు నా రెండు కాళ్ళు పట్టుకొని యేడ్చి బ్రతిమాలుకొన్నాడు. స్వాములవారి పేర వ్రాసి ఆంక్షపత్రిక తెప్పించి డొక్క బ్రద్దలు చేసెద నని నేను వానిదగ్గర పది వరాలు సొమ్ము గుంజుకొని రహస్యము బయటబెట్టక కాపాడినాను. వాఁ డిప్పుడు నగ్నప్రచ్ఛాదనలు చుట్టుప్రక్కల పది పన్నెండు గ్రామములలో పట్టు చున్నాఁడు. నా మాటంటె చాల గౌరవము. నేను గీచిన గీటు దాటడు వాఁడు. నేను చెప్పినట్టు చేయఁగలడు. ఆ దంపతులిద్దఱు గూర్చుండి కన్యాదానము చేయ నొప్పుకొన్నారు."

"సరే ! చాలా బాగున్నది. వారికిఁ ద్వరగా వర్తమానమంపండి ! పిల్ల నిద్రపోయినది. ఈ సమయములోనే గబ గబ ముడివేయ వలెను. లేచిన పక్షమున నేడ్చునేమో ! రండి దేవాలయములోనికి" అని పుల్లయ్య వారిం ద్వరపెట్టెను.

గణపతికి మెడలోఁ బెద్ద జందె మొకటి పడుటే ప్రధానము గాని కన్యాప్రదానము తల్లిదండ్రులే చేయవలె నను పట్టింపులేదు. అప్పుడు వారందరు దేవాలయమునకుఁ బోయిరి. తొలుత గ్రహించిన రెందు రూపాయలకుఁ దోడుగా మఱి రెండు రూపాయలు వచ్చునను నాసతో నర్చకు డచ్చటనే గూర్చుండెను. మంగళంపల్లి నరసయ్య పుత్రకళత్ర సమేతుఁడై