ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

గ ణ ప తి

మన గ్రామములో జనులే గాక చుట్టుప్రక్కల గ్రామముల వాండ్రుకూడ గణపతిగాడు బహద్దరురా ! మంచిపని చేసినాడని మెచ్చి సంతోషింతురు. కనుక నీ వీ విషయములో గట్టి పని చేయవలెను. ఇసుక తక్కెడకు వెంటనే పేడ తక్కెడ ఉండవలెను. కుక్కకాటుకు చెప్పుదెబ్బ తగలవలెను" అని యుపదేశము చేయుటయు, గణపతి సంతోషించి, "పుల్లయ్యమామ ! నీ యుపాయము బాగున్నది. కాని యది యేలాగున నెరవేరఁ గలదు? ముందు మనకు పిల్ల స్వాధీన మగు టేలాగు? అది యొంటరిగా మనకు దొరుకునా ? దొరకినప్పటికిఁ దలిదండ్రుల విడిచిపెట్టి మనతో నది పొరుగూరు వచ్చునా ? బలవంతమునఁ దీసికొని పోదుమా యది యేడ్చి గోలచేయదా? ఆ గోల విని పదిమంది చేరరా? అప్పుడు మన ప్రయత్నము చెడిపోదా? అదిగాక యే గ్రామములో వివాహము చేసికోఁగలను? ఎవరికి దెలియకుండ ముందక్కడ బ్రయత్నము చేయవద్దా? డబ్బు కావలెఁ గాఁబోలు. నా దగ్గర డబ్బులేదు. వీటి కన్నిటికి నీవే యేదో యాలోచన చెప్పవలె" నని పలికెను. అడుగుటయు నతనికి పుల్లయ్య యిట్లనియె. "ఆ గొడవ నీకక్కరలేదు. కావలసిన సొమ్ము నేనే పెట్టుబడి పెట్టఁగలను. నీ తల్లి మాయింటి యాడుపడుచు. నీవు నాకు మేనల్లుడవు. నా దగ్గర నలుసంత ఆడపిల్ల ఉన్నపక్షమున నేనే నీకు పిల్లనిచ్చి పెండ్లిచేయవలసిన వాఁడను. వేయేండ్లు తపస్సు చేసినను కలిసిన సంబంధము దొర