ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

237

నందున వారికి మాటలు గాని శుభాశుభ కార్యములందు భోజన ప్రతిభోజనములు కాని లేవు. శక్యమైన యెడల నాగన్న కపకారము చేయవలె నని పుల్లయ్యయు, పుల్లయ్య కపకృతి చేయవలె నని నాగన్నయుఁ జూచుచుండిరి. అట్టి సమయములో నొకనాడు గణపతి పుల్లయ్య యింటికిఁబోయి నాగన్న కూతురుయొక్క వివాహము కాకుండఁ జేయుట కుపాయము చెప్పుమని యడిగెను. పుల్లయ్య ముహూర్త మాలోచించి "వహవ్వ! మంచియుపాయము దొరికిందిరా! గణపతీ ! ఇది సాగెనా బుచ్చి, రాయప్పకుఁ దక్కకుండ నీకే దక్కు" నని యుత్సాహముతోఁ బలికెను. పిల్ల తనకే దక్కు నన్న మాట వినఁబడగానే గణపతి సంతోషముచే హృదయ ముప్పొంగ "పుల్లయ్య మామ ! ఉపాయ మేదో త్వరగా జెప్పు! నాగన్నగాడి రోగము మన మందఱము చేరి కుదుర్చవలె" ననియెను. అనుటయు పుల్లయ్య యిట్లనియెను. "బుచ్చిని నీవె తీసుకొని పోయి రహస్యముగా నేదో యొక గ్రామములో దేవాలయములో పెండ్లి చేసుకో. దానితో నాగన్న రోగము రాయప్ప రోగము కూడ కుదురును. రాయప్పగాడికి రెండువందల రూపాయలూ తిరుక్షౌర మన్నమాటె. నీకు దమ్మిడీ ఖర్చులేకుండా పెండ్లి యగును. ఒకసారి పెండ్లియయిన పిల్లకు తిరిగి పెండ్లిచేయగూడ దని మన శాస్త్రము. ఏడువనీ మొత్తుకోనీ తిట్టనీ పెండ్లి మాత్రము చేయుటకు వీలులేదు. ఎప్పటికయినా బుచ్చి నీ పెండ్లామే, తప్పదు. ఈ పని నీవు చేసితివా