ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

235

చేయి విసరి రెండు తగులనిచ్చుచు, యధేచ్చముగఁ దిరుగ జొచ్చెను.

గ్రామస్థులలో గొంద రప్పుడప్పుడు గణపతి యొక్క స్వచ్ఛందవ్యవహారములఁ జూచి నవ్వుచు "ఏమిరా, యీయన్యాయము? చెట్టంత మగబిడ్డవు, నీ వుండగా మీయమ్మ బిచ్చమెత్తుకొనుట న్యాయమటరా? ఆ గిరజాలేమిటి? ఆ పొగచుట్టలేమిటి ? ఆ ముచ్చె లేమిటి? ఆ టక్కు టక్కు లేమిటి? తల్లి యాయవార మెత్తు టేమిటి, సిగ్గులేదా? పెద్దముండ, ఆవిడను పోషించుటకు మారుగా నిన్నే యావిడ పోషించవలెనా?" యని చివాట్లు పెట్టఁ జొచ్చిరి. అది విని గణపతి రోసము దెచ్చికొని తల్లిచేత బిచ మెత్తింపఁ గూడదని యామెను మాన్పించి తానే చెంబు దీసికొని యాయవార మారంభించెను. అదెట్లనఁగా నుదయమున లేచి చల్దికూడు దిని గిరజాలు దువ్వుకొని కోటు తొడుగుకొని తెల్లపంచె కట్టుకొని పొగచుట్ట నోటపెట్టుకొని కుడిచేతితో చెంబు పట్టుకొని యెడమచేతి తర్జనమధ్యమాంగుళీయములతోఁ పొగచుట్ట నోటనుండి పట్టుకొని యుమ్మి వేయుచు, యాయువారము చేయును. ఆ వేషమును జూడ గ్రామ మందలి స్త్రీ పురుషులు బాలురు పనులు మానుకొని వచ్చి గణపతితో నించుకసేపు పని లేకపోయినను బ్రసంగించి, పొట్టలు విచ్చునట్లు నవ్వుకొని వినోదించు చుందురు. గణపతి యక్షయ పాత్రము బుచ్చుకొని యెవరింటికైనను వెళ్ళి నప్పుడు వారు లోపలినుండి బియ్యము