ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

227

గాడి కివ్వక యెవరికో యిచ్చుకోదలచు కొన్నాడట! మా వదినకు నెల తప్పినది మొదలుకొని ఆడపిల్లే పుట్టవలెనని అది నా కోడలు కావలె నని యెంతో ముచ్చటపడి పుట్టెడాశ పెట్టుకొని యున్నాను. నా యాస లడుగంటిపోయినవే, పుల్లమ్మత్తా! నా కొడుకు దిక్కుమాలిన పక్షి అయినాడే, పుల్లమ్మత్తా! ఎవడో దిక్కుమాలిన ముండాకొడుకు వచ్చి పిల్ల నెత్తుకొని పోదలచుకొన్నాడు, పుల్లమ్మత్తా! ఇక నేనేమి చేతును? పుల్లమ్మత్తా ! పల్లకిలో గణపతి, బుచ్చి కూర్చుండగా ముచ్చటగా చూడవలె ననుకొన్నానే, అమ్మా! బుచ్చి బుల్లి చేతులతో గణపతి నెత్తి మీద తలంబ్రాలు పోయగా రెప్పవేయకుండా చూడవలె ననుకొన్నానే, యమ్మా! తలుపు దగ్గఱ పేరులు చెప్పించి వినవలె నని అనుకొన్నానే, అమ్మా! గంధాలు పూయించవలె ననుకొన్నానే అమ్మా! నాకన్నులు కాలిపోయినవే, అమ్మా! నేనెంత పాపిష్టి ముండనే, అమ్మా!" యని పరిపరి విధముల వన్నెలు చిన్నెలు పెట్టి యేడ్చెను.

ఆ యేడ్పు విని జాలినొంది చూడవచ్చిన యిరుగు పొరుగు పడతులు "మేనరికమంటే ఆడపడుచు ఆశపడక పోదు కదా. దాని కొడుకు బ్రహ్మచారియై పోవలసి వచ్చింది గనుక దాని కంత బాధగా నున్నది. మేనల్లు డేలాటివాడై నప్పటికి మేనమాక పిల్లనిచ్చుట న్యాయ" మని కొందరు, "అల్లరి చేయక అతని కాళ్ళమీదను బడి మెల్లగా బతిమాలు కోవే,