ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

221

మానండి, మా పినతల్లికొడుకు రాయప్పను మీ రెరుగుదురు కదా! మన బుచ్చి పుట్టింది మొదలుకొని వాఁడు దానిని తనకిమ్మని నన్నడుగుచున్నాఁడు. ఆ మధ్య వాడిక్కడికి వచ్చినప్పుడు "ఓసి ! గంగమ్మా! మీ బుచ్చిని నాకిచ్చి పెండ్లి చేసి నాబ్రహ్మచర్యము వదల్పవే నావంశము నిలిపినదాన వగుదువు" అని యెన్నో విధముల బ్రతిమాలినాఁడు. వాడు పునహా వెళ్ళి ఐదారువందల రూపాయలు సంపాదించుకొని వచ్చినాఁడు. ముసలివాడు కాడు. ముక్కవాడు కాడు. నోటికి చేతికి యెంగిలి లేని సంబంధము. మనకు చేలోకువైనవాఁడు. మన బుచ్చిని వాడికిచ్చి పెండ్లిచేసినపక్షమున మన ఋణము దీరి పోవును. నాలుగేండ్ల పిల్ల గనుక నాలుగువందలు వా డివ్వగలడు. ఒక వందరూపాయలు వస్తువులుకూడ పెట్టుమని నేను చెప్పి పెట్టించగలను. ముప్పదేండ్లకంటె యెక్కువలేవు. కాలు నొచ్చినా కడుపు నొచ్చినా కాకిచేత వర్తమానమంపితే రెక్కలు కట్టుకొని వచ్చి, వాడిక్కడ వాలి మన పనిచేసి వెళ్ళిపోవును. మా నాయన కూడ మనపిల్లను రాయప్పకే యిమ్మని రెండు మూడు సారులు నాతో చెప్పినాఁడు. మాయమ్మ సరేసరి. నూరు సారులు చెప్పింది. మనకు నూరు వరహాలు చేతికిచ్చి పిల్లకు నూరు రూపాయలు నగలు పెట్టి ఉభయఖర్చులు తానే పెట్టుకొని పెండ్లి చేసికొని వెళ్ళునట్లు మా నాన్నద్వారా నే నేర్పాటు చేయగలను. పెండ్లి యిక్కడ చేసినను సరే మానాన్నగారి యింటిదగ్గర చేసి