ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

209

తిన్నంత తిని పారవైచినంత పాఱవైచెనని నా నెత్తిమీఁద లేనిపోని నిందలు వేయుటకును, పెట్టిన యన్నము దిగబెట్టుట కాదని యేలాగో యొకలాగు తిన్నపక్షమున మా మేనల్లుడు పూటకు తవ్వెడు బియ్యపన్నము లకోటాకు మెతుకు లేకుండ తినునని వాడుకలు వైచుటకు యీమె యీపని చేయుచున్నది. ప్రతిదిన మీలాగుననే జరుగుచున్నది. ఒకసారి మీ వంటి పెద్దల కీ చిత్రము చూపించిన పక్షమున బాగుండు నని నేను మిమ్ము దీసికొని వచ్చితిని. నేనుమాత్రము అమ్మవారినా ? దున్నపోతునా ? నాది మాత్రము కడూపు గాక మడుగా యేమిటి ? " యని యా యన్నము జూపెను.

సాక్షిగా వచ్చిన బ్రాహ్మణుఁ డా యిల్లాలిం జూచి "అమ్మా ! ఇతఁడు పదునెనిమిది సంవత్సరములలోపు పిల్లవాఁడు కదా ; అంత యన్నము తినఁగలడనే మీరు పెట్టినారా ? లేక పొరపాటు చేత పెట్టినారా? కొంచె మన్నమే మొదట వడ్డించి కావలసిన పక్షమున మరల మారు వడ్డింపరాదా? రెండుసారులు తిరుగుట తప్పిదమా? పాప మా కుఱ్ఱవాఁడు మీరు పెట్టిన యన్నము ప్రోగు చూచి యడలిపోయినాఁడు. ఇదెంత మాత్రం బాగులేదు. మీ పెనిమిటి మాత్రమిటువంటి పని కొప్పుకొనునా?" యని మందలించెను. అనవుడు బ్రాహ్మణుని కామె తలుపు చాటున నొదిగి యుండి మెల్లగా నిట్లనియె. "అయ్యా ! మే రెరుఁగరు గాని మా గణపతి మామూలుగ తినగలంత యన్నమే