ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

201

మున వారు సంతుష్టిచెందరు. గావున గణపతి నిమిష మాలోచించి వారి మనస్సులు తృప్తి పొందించుటకై యిట్లు చెప్పెను. "ఓరీ ! వెఱ్ఱికుంకలారా ! దండుగు బేరములో దిగుటకు నే నంత పిచ్చివాఁడనా? దీని కొక కారణమున్నది. చెప్పెద వినుండు. పాప మా యజమానుడు మిక్కిలి మంచివాడు. కాని డబ్బులేదట ! యింటి డాబు, వాకిలి డాబే గాని-డబ్బు లేదట. సంసారము మేడిపండు వాటముగా నున్నదట! ఆయన నన్ను రప్పించిన పని యేమను కొన్నారు? పాపము! సంపన్నగృహస్థుడు నన్ను బిలిపించి నా రెండు చేతులు బట్టుకొని 'నాయనా గణపతీ! ఇవి చేతులు గావు కాళ్ళుసుమీ, నా పరువు కాపాడవలెను. నేను వట్టి వ్యర్థుఁడను. ఋణములబాలై యున్నాను. ప్రస్తుతము కోటుగుడ్డలు నీకియ్యలేను. ఇప్పటి కీ సైను గుడ్డలు పుచ్చుకొని సంతోషించవలసినది. మీస్నేహితులు నీవు చెప్పినట్లు నడుచుకొందురు. నీ కున్న పలుకుబడి నిజముగా మహారాజునకైన లేదు. నీ స్నేహితులతో మాట్లాడి వారి నొడఁబరచి నన్నొకదరికి జేర్చవలె' నని వేడుకొన్నాఁడురా! అంతవాఁడు నాచేతులు పట్టుకొని ఎంతో వినయముతో వేడుఁకోగానే నా మనసు కరిగిపోయినది. నేను రెండవమాట చెప్పలేకపోయినాను. మీ చేత తిట్లు పడినను సరే కాని యాయన కోరిక ప్రకారము చేయవలెనని యీ మూట పట్టుకొని వచ్చినాను. మీయిష్టము వచ్చినట్లు చేయండి. మీరు తిట్టినను సరే, కొట్టి