ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

గ ణ ప తి

పలికెను. "అబ్బ ! చేతులు నలుపుకొనుచు వెళ్ళిపోవలెనే? ఈ మాత్రపు దానికి మమ్మెందు కాపవలెను! తప్పక యిచ్చెద నని శ్రాద్ధము సరిగా జరిపించుకొని, యేఱుదాటి తెప్ప తగుల వైచిన ట్లవసరము తీరిన పిదప చేతులు నలుపుకొనుచు వెళ్ళు మందురా? సరే! ఈ మాటు అవసరము దాటినదిగదా యని మీరు సంతోషించు చున్నారు గాబోలు ! ఇంతటితో నైపోయినదా? ఈ వేళ కాకపోతే రేపైనా తిరిగి అవసరము రాదా? మీరు చావరా? మీ బందుగులు చావరా? అప్పుడు భోక్తలతో నవసరముండదా? అప్పుడే మీ పని చెప్పగలను. తొందర పడకండి. ఇల్లలకగానే పండుగ కాలేదు. తొందర పడకండి! తద్దినపు మంత్రము జెప్పెడు వాండ్రతోను భోక్తలతోను అవసరము లేనివాఁడు లోకములో లేఁడుగదా!" యని గణపతి క్రోధావేశంబున నౌచిత్య మెఱుఁగక నోటికి వచ్చినట్లు బ్రసంగించెను. యజమానుని మనసులో నదివఱకే రవులుచున్న కోపాగ్ని నా పలుకులు మండించెను. కోపాగ్ని ప్రజ్వరిల్లుటయు యజమానుఁడును "ఊరకున్నా రేమిరా?" యని ప్రక్క నిలిచిన వంట వాండ్రతో ననియెను. అనుటయు నా వంటవాం డ్రిరువురును గణపతిని బట్టి కొల్లాయి గుడ్డతో నతనిని పందిరిపట్టె మంచపు కోటికిఁ గట్టి వైచిరి. యజమానుఁడు క్రొత్తగా చెట్టునుండి కోసి తెచ్చిన పొడువాటి యీత జువ్వ తీసికొని "భడవా? తుంతరి వెధవా! శ్రాద్ధబ్రాహ్మణార్థములు చేసి పదిమంది నాశ్రయించి"