ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

195

పరాయి వాడనా? నేను నీమనుమఁడనె యనుకో! నేను మైల భోజనము చేసినాను గనుక రేపుదయమున స్నానము చేయవలెను. ఈ రాత్రి నాకు భోజనము లేదు. ఈ బూరెల మూఁకుడు చెఱువు గట్టునకు దీసికొనిపోయి రొట్టె యే కాపుల కుఱ్ఱవానికో బెట్టి మరల మూకుఁడు దెచ్చి నీకప్పగించి యీ స్థల మలికి వెళ్ళెదను" అని యామె మైలపడకుండునట్టి యుపాయము జెప్పెను. రొట్టె పోయినందుకు ఆమె విచారింపక కుక్కయెంగిలి ముట్టుకొనకుండఁ దనపాలిటి దైవమువలె గణపతి వచ్చి తనకు సహాయము చేసి నందుకు సంతసించి "నాయనా ! ఈ పని నేనే నీకు జెప్పుటకు సందేహించి యూరకుంటిని. కావలసిన వాఁడవు గనుక మనస్సులో నెరమరిక లేక యీ పని కొప్పుకొంటివి. ముసలమ్మ మీఁద నెంతో యభిమానముతో ఎక్క డున్నానోయని వెదకికొనివచ్చి నాకీ పూట సాయము జేసితివి. రేపు శుద్ధిస్నానము చేసి మా యింట పట్టెడు మెతుకు దిని వెళ్ళు, నాయనా! " యనెను. "రేపు గ్రామములో నున్న పక్షమున నాలాగే చేసెదనులే, ఇదిగో బూరెల మూకుడు తీసికొనిపోవుచున్నాను. వెంటనే వచ్చెద" నని చెప్పి యాబూరెల మూఁకుడు చెఱువుగట్టుకుఁ దీసికొని పోయి పాలు గోరుచున్న మిత్రుల కీమాట చెప్పక రావిచెట్టుక్రింద బెట్టుకొని రొట్టె రవంతయు మిగులకుండ దిని నీళ్ళుద్రాగి గఱ్ఱున త్రేన్చి, యా మూకుఁడు తానే తోమి కడిగి యవ్వ కప్పగించి కుక్క ముట్టుకొన్న చోట గోమయముతో నలికి శుద్ధిచేసి ముసలమ్మను