ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

173

డతఁడు తన మనంబున నిట్లనుకొనెను. "తద్దినములకు షోడశములకు బ్రాహ్మణులకుఁ బనికిమాలిన సైనుగుడ్డ లిచ్చెదరు. కాని శుభ్రమైన కోటుగుడ్డలు రెండు మూఁడు తెచ్చి యిచ్చిన పక్షమున నెంత బాగుండును. తెలివితక్కువ ముండాకొడుకులు స్వయముగ దెలిసికొనలేరు. ఆలోచనలు చెప్పిన వారిమీఁద మూరెడు కోపము. కోటుగుడ్డ లియ్యనిచోటికి బ్రాహ్మణార్థమునకు వెళ్ళవద్దని బ్రాహ్మణార్థములు చేయు కుఱ్ఱవాండ్రందరఱకు నచ్చచెప్పి కట్టు కట్టించెదను. అప్పుడుకాని వాండ్రరోగము కుదరదు!" అట్లనుకొనుచుండఁగ మెల్లమెల్లగ నిదురపట్టెను.

పదియవ ప్రకరణము

వివాహానంతరమున గణపతి కోమటులతోఁ గలసి స్వగ్రామము జేరెను. ఇతరుల సొత్తునకుఁ దన సొత్తునకు భేదము లేదను నద్వైతబుద్ధిచేతనైన నేమి, హస్తలాఘవము చేతనైన నేమి ముచ్చెల విషయమున ముచ్చట తీర్చుకొనుట కవకాశము కలిగినది. కాని కోటు విషయమున ముచ్చట తీరినది కాదని యతనికి బెంగపట్టెను. కోటుగుడ్డలున్న దుకాణములలో హస్తలాఘవము చేయుటకు వీలు చిక్కినదికాదు. పోనీ, కుట్టి సిద్ధముగా నున్న కోటులే హస్తలాఘవము చేసి