ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

గ ణ ప తి

గిరజాల యుబలాటము ముచ్చెల యుబలాటము దీరిన పిదప గణపతికి మఱియొక కోరిక పుట్టెను. పుట్టి బుద్ధి యెఱింగిన తరువాత నతఁడు కోటు తొడిగి యెఱుఁగఁడు. చీట్లపేక లోపలి కోటులే కాని శరీరాచ్ఛాదనము చేయు కోటు అతఁడు చూచి యెఱుఁగడు. తల్లి చిన్నప్పుడు ముద్దునిమిత్తము బొందుల చొక్కాలు రెండు కుట్టించెను. కాని యవి చిరిగిపోయెను. కోటు తొడిగిన మనుష్యుఁడతని కెంతో విచిత్రనరుఁడుగ గనఁబడెను. రెండుకోట్ల రూపాయ లున్నను హాయిగా దొడిగికొనుటకు రెండు కోట్లు లేనిపక్షమున వాని జన్మంతయు వ్యర్థము. పశువునకు వానికిని భేదమే లేదని యతని మనంబునకుఁ దోచెను. ఎటులైన నొక కోటు గాని, రెండు కోట్లు గాని కుట్టించుకొనవలయునని తలఁచి చేత డబ్బులేనందు కతఁడు విచారించి గుడ్డలు చేతితో స్పృశించియుఁ గన్నులం జూచియు ధన్యత జెందవలయునని మంచి కోటుగుడ్డ లున్న దుకాణము లన్నింటికి జని యెంత వెలయైన నిచ్చి కొనువానివలె మూటలు విప్పించి గుడ్డల నన్నింటిని బేరమాడి చేతిలో నాణెము చూచి రంగు వెలియదు కదా? చాలకాలము మన్నునుగదా? యని యడిగి తక్కువ వెలల కడిగి బేరము కుదరక వెడలిపోయినట్లు దుకాణములు విడిచి వెళ్ళెను. ముచ్చెలజోడు సంపాదించిన విధమున నీకోటు గుడ్డలు సంపాదించుట కెంతమాత్రము వీలు చిక్కకపోయెను. ఆ రాత్రి యతని కా విచారము చేత నిద్రయే పట్టలేదు. అప్పు