ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

163

దుర్లభమమైన సువర్ణకిరీటము మస్తకమున ధరించిన వాఁడువోలె నాఁటి దినమంతయు గణపతి మిక్కిలి యుత్సాహము గలిగి చూపులలోను, మాటలలోను, నడకలలోను, ముఖవైఖరిలోను గర్వముట్టిపడునట్లు సంచరించెను. పెండ్లివారితో వచ్చిన యువజను లందఱును జతురోక్తులయం దాశక్తిగల కొందరఱు పెద్దలును నాఁటి దినమున వేశ్యల మేళమున కరుగక గణపతి చుట్టుఁ జేరి వారి మాటలు విని వాని చేష్టలు చూచి వినోదము నొందిరి. పెండ్లికొడుకు చేత సిఫారసు చేయించుకొని పెండ్లికి వచ్చిన యాఁడువాండ్ర దగ్గరనుంచి సంపంగ నూనె దెప్పించి లేత మొక్కలకు మంచి యెరువు వైచు కాఁపువాడువలె తన తలకు రాసుకొని వెండ్రుకలు త్వరగా యెదుగు సాధనములేవి యని దన కన్నులకు బండువుగా నుండునట్లు పెద్ద గిరజాలను పెంచుకున్న వారిని పలుమారు గ్రుచ్చి గ్రుచ్చి యడుఁగజొచ్చెను. పరిహాసము చేయుటలో మిక్కిలి ప్రౌఢుఁడైన యొకానొక యువజనుఁడు గణపతిని రహస్యముగా నొకచోటికిఁ దీసికొనిపోయి యతని శిరోజ వృద్ధి యందత్యంతాసక్తిగలవాడు వోలెనతని చెవిలో నిట్లనియెను. "అగరు నూనెతోను, సంపంగి నూనెతోను దలవెంట్రుక లేపుగాఁ బెరుగవు. మంచి వంటయాముదము దెచ్చి నాలుగు దినములు రాచితివా వానచినుకులు పడగానె చికిలింత మొలిచినట్లు వెంట్రుకలు చురుకుగా నెదుగును. నేనట్టి దోహదము చేయబట్టి నా గిరజాలింత సొంపుగా నెదిగినవి. నీ వెంట్రుక లెదుగుట మన