ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

గ ణ ప తి

లేక తిరుగుచుండ నే ప్రజ్ఞలేక మనుష్య మాత్రుడై కించిజ్ఞుడై బాలుఁడైన గణపతి గాడిదనెక్కి దిరుగుట యేమితప్పు? దున్నపోతు యొక్క యతిశయ మేమి? మూషికము యొక్క ముఖ్యతయేమి? గాడిదచేసిన కానిపనియేమి? అభిమానము చేత నెద్దులనుఁ దున్నపోతులను నెక్కినవారిని మహర్షులు పురాణములలో గొనియాడగనే మీరును బళిబళీయని మెచ్చి పూజించుచున్నారు. గణపతి డబ్బులేని పేదబాపనయ్య కొడుకగుటచేత గాడిద నెక్కి నంత మాత్రమున నిర్భాగ్యుఁ డనుటకు సాహసించు చున్నారు. పక్షపాతమె ప్రేమ గలిగించును. పక్షపాతమె యేవ గలిగించును. గుణశూన్యుఁ డైనను మెచ్చి పొగడు వారున్న పక్షమున గుణరత్నాకరుఁ డగును. మెచ్చి కొనియాడు వారు లేనప్పుడు గుణరత్నాకరుఁడు సయితము శుంఠయగును. నోరు గలవాండ్రు గొందఱఁ జేరదీసిన దేవానాం ప్రియుఁడు సతతము మహా పురుషుఁడుగ పరిగణింపఁ బడుచున్నాఁడు. ఆలంబము లేని వాఁడణఁగి పోవుచున్నాఁడు. మా గణపతి యాత్మ గౌరవము గలిగి స్వప్నములోఁ గనఁబడి తన వృత్తాంతముఁ జెప్పబట్టి యది వ్రాయు వారొకరు దొరకబట్టి యీ మాత్రము గ్రంథమైన బయలుదేఱినది. కాని లేకపోయినచో నేమి కావలసినది? అడవిలో బుట్టి అడవిలో బెఱిగి యడవిలో రాలిపోయిన యుమ్మెత్త పువ్వువలె సముద్రములో బుట్టి సముద్రములో బెఱిగి సముద్రములో నణఁగిపోయిన నత్తగుల్లల