ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

గ ణ ప తి

మీఁద నా ప్రమధ గణపతి యెక్కగా మన గణపతి గాడిద మీఁద నెక్కుట తప్పా? అతని మాట యటుండనిండు. లక్ష్మీనారాయణుల పుత్రుడయిన గరళ కంఠునివంటి మహాదేవుని జయించిన జోదై చండ శాసనుఁడయి సకల లోకంబులంగల సకల జంతువులను బూవు టమ్ములతో గొట్టి పడవైచునట్టి మన్మధునకు వాహనమేమో యెఱు@గుదురా? చిలుక. ఆ మన్మధుని తండ్రియగు నారాయణుని తురంగమేమొ యెఱుఁగుదురా? బొల్లి గ్రద్ద. ఎక్కడ దిక్కులేనట్లు తండ్రి కొడుకులైన మాధవమన్మధులు రెక్కాడినగాని బ్రతుకలేని దిక్కుమాలిన పక్షులపై నెక్కుచున్నారు. అనంతకోట్యవతారంబులనెత్తి పరాత్పరుఁడనియుఁ జరాచరాత్పరుఁడనియు వ్యాసవసిష్ఠ వామదేవాది మహర్షుల చేతవినుతింపఁ బడిన శ్రీమన్నారయణుఁ డెక్కుటకు లోకమున బొల్లిగ్రద్ద తప్ప వేరువస్తువులు లభింపవా? ఇక శివుని మాట తడవబనియేలేదు. ఆయన వెల్ల యెద్దునెక్కి విహారము చేయును. అడ్డమైన గడ్డి కఱచునట్టి పశువు మీదనా శివుడెక్కవలసినది? మహేశ్వరుఁ డెంతవాఁడు? లలాట నేత్రజ్వలన కీలల చేత నిమిషార్థమున విష్ణు పుత్రుఁడగు దర్పకుని బిడికెడు బూడిద చేసినాఁడు. క్షీరసాగర మధన కాలమున సముద్ర గర్భమునుండి బొడమి లేచిన హాలాహల విషము సకలలోక భయంకరమై వ్యాపించి బ్రహ్మండము భస్మీపటలముఁ జేయునటులుండ ముప్పది మూడు కోట్ల దేవతలు వెఱచి రక్షింపుమని చేతులు మోడ్చి