ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

13

పరిపాలకులై యేకపత్నీ వ్రతస్థులైరా? తలిదండ్రులను నిరంతరము గొట్టి తిట్టునట్టి కష్టచరిత్రుఁడుగూడ రాముఁ డను పేరం బఱగుచుండును. అట్టి మూర్ఖుఁడు సాపాటు రాముడగును గాని గుణములలో దశరథరాముఁ డగునా? నోరుఁ విప్పునపు డెల్ల నబద్ధములే చెప్పువాఁడు హరిశ్చంద్రు డనుపేరఁ బరగవచ్చును. లక్ష్మీప్రసాదుఁడను నామధేయము గలవాఁడు నిరుపేద గావచ్చును. తలిదండ్రులు వెఱ్ఱెయ్య యని పేరు పెట్టుకొన్న బాలుడు మేథావంతుడై తన ప్రతిభాప్రభావముచేత జగంబును వెలయింపవచ్చును. తలిదండ్రు లొక యుద్దేశముతో బేరుపెట్టవచ్చును, కుమారుని యుత్తరచరిత్ర మా యుద్దేశమునకు వైరుధ్యమును జూపవచ్చును. గణపతి తలిదండ్రులు తమ కుమారున కిష్టదేవత పేరే పెట్టియుండవచ్చును, లేదా వినాయక చతుర్థినాఁ డతఁడు జన్మించి యుండుటచే నా నామము గలిగి యుండవచ్చును. కాదేని వారి వృద్ధ ప్రపితామహుఁడు యా పేరువాఁడై యుండనోపు. అదియును గానిపక్షమున బుట్టినప్పడు బుల్లిబొజ్జ, బుంగమొగము, బుఱ్ఱముక్కు, గుజ్జురూపముఁ జూచి తమ భక్తికిఁ దమ తపః ప్రభావమునకు మెచ్చి యదితి కశ్యపుల గర్భమున శ్రీమన్నారాయుణుఁడు వామనరూపము ధరించి జన్మించినట్లు తమ్ము ధన్యులఁ జేయుటకు దమపేరు మహీతలమున వెలయించుటకుఁ దమ వంశము పావనముఁ జేయుటకు గణపతి తమ గర్భవాసమున జన్మించియుండునని నమ్మి మాతాపితృ